Skip to main content

Jishnu Dev Varma: రాజ్‌భవన్‌ పాఠశాలను సందర్శించిన గవర్నర్‌

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆగ‌స్టు 23న‌ రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశా లను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు.
Jishnu Dev Varma

జాతి నిర్మాణంలో విద్యకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసే పనిని కొనసాగించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి ఆకాంక్షలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

చదవండి: Collector Tejas Nandlal Pawar: పాఠశాలకు వెళ్లి.. పాఠాలు బోధించి..

తమ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. సమాజం పట్ల బాధ్యతను పెంచుకోవాలని కోరారు. గవర్నర్‌ విద్యార్థులతో సరదాగా మాట్లాడుతూ వారితో కొంత సమయం గడిపారు. తమ చదువుల పట్ల గవర్నర్‌ చూపుతున్న శ్రద్ధను చూసి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి పాఠశాల చేస్తున్న కృషిని గవర్నర్‌ ప్రశంసించారు.   

Published date : 24 Aug 2024 11:56AM

Photo Stories