Collector Deepak Tiwari: పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలి
Sakshi Education
ఆసిఫాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆగస్టు 23న జిల్లా మహిళాశిశు సంక్షేమ అధికారి భాస్కర్‌తో కలిసి సీడీపీవోలు, సూపర్‌వైజ ర్లు, పిరామిల్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఎస్‌ఎస్‌ఎఫ్‌ఎస్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో సకాలంలో పౌష్టికాహా రం అందించి, పిల్లల ఆరోగ్య స్థితిగతులు పర్యవేక్షించాలన్నారు.
చదవండి: DEd Admissions 2024: 25తో ముగుస్తున్న డీఈడీ ప్రవేశాలు
ప్రతీ కేంద్రంలో టీహెచ్‌ఆర్, హెచ్‌సీఎం వివరాలు పోషణ్ ట్రాకర్ యాప్‌లో వందశాతం నమోదు చేయాలన్నా రు. పిల్లల ఎత్తు, బరువు నమోదు చేస్తూ పోషకాహార లోపం ఉన్న వారిని గుర్తించాల ని సూచించారు. సదుపాయాల కల్పన కోసం పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయకర్త గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Published date : 24 Aug 2024 01:52PM