DEd Admissions 2024: 25తో ముగుస్తున్న డీఈడీ ప్రవేశాలు
Sakshi Education
భద్రాచలం అర్బన్: గిరిజన డీఎల్‌ఈడీ కళాశాలలో ప్రవేశాలకు ఆగస్టు 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ వైకేడీ భవాని ఆగస్టు 22న ఒక ప్రకటనలో తెలిపారు.
కళాశాలలో మొత్తం 50 సీట్లు ఖాళీగా ఉన్నాయని, దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏజెన్సీ ప్రాంతవాసులై ఇంటర్మీడియట్‌లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలన్నారు.
చదవండి: Artificial Intelligence: ఆరోగ్య సంరక్షణలో.. క్విక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ యాప్!
దరఖాస్తులను భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులోని డీఎల్‌ఈడీ కళాశాలలో ఇవ్వాలని, మరిన్ని వివరాలకు 99595 75539, 79812 55624 నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.
Published date : 23 Aug 2024 02:01PM