Tenth Class: ఫీజు గడువు పెంపు.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
పదవ తరగతి కామ న్, ఒకేషన్ కోర్సుల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది.
తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ పరీక్షల విభాగం డైరెక్టర్ కార్యాలయం ఈమేరకు జనవరి 28న ఉత్తర్వులు జారీచేసింది. టెన్త్ పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్య ర్థులు జనవరి 29 వరకు ఫీజు చెల్లించాలని గతంలో షెడ్యూల్ ఇచ్చారు. ఫీజు చెల్లింపు గడువును ఎలాంటి అపరాధరుసుం లేకుండా ఫిబ్రవరి 14 వరకు స్వీకరిస్తారని పరీక్షల విభాగం తెలిపింది. రూ.50 పెనాల్టీతో ఫిబ్రవరి 24 వరకు, రూ.200 పెనాల్టీతో మార్చి 4 వరకు, రూ.500 పెనాల్టీతో మార్చి 14 వరకు ఫీజు చెల్లించుకోవచ్చని పేర్కొంది.
చదవండి:
Education: మన విద్యా విధానాలను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలు
Published date : 29 Jan 2022 05:50PM