Teachers: బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ షురూ
ఇదివరకే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న జెడ్పీ, ప్రభుత్వ యాజమాన్య ప్రధానోపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. జెడ్పీ యాజమాన్యం పరిధిలో 35మంది, ప్రభుత్వ యాజమాన్యం పరిధిలో ఇద్దరు బదిలీ కాగా, ఆన్‌లైన్ నుంచి ఉత్తర్వులు డౌన్‌లోడ్ చేసుకుని విధుల్లో చేరారు. ప్రభుత్వ పరిధిలో నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరు, జెడ్పీ యాజమాన్యం పరిధిలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఇద్దరు బదిలీపై ఈ జిల్లాకు వచ్చారు.
చదవండి: Byjus Tabs at Schools: పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌ల పంపిణీ
48మందికి హెచ్‌ఎంలుగా పదోన్నతి!
హెచ్‌ఎంల బదిలీ ప్రక్రియ ముగియగా అధికారులు పదోన్నతుల కోసం వెకెన్సీలు సిద్ధం చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు పీజీ హెచ్‌ఎంలుగా గురువారం పదోన్నతులు కల్పించనున్నారు. బుధవారం నుంచి ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. జెడ్పీ యాజమాన్య పరిధిలో 41 మందికి, ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఏడుగురు స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు లభించనున్నాయి. ఈ ప్రక్రియ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు బదిలీ ప్రక్రియ, ఆ తర్వాత ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనున్నారు.
చదవండి: Teachers Examinations: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు పరీక్షలు
అక్టోబర్ 5 వరకు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరిలో బదిలీలు, పదోన్నతులు జరగాల్సి ఉండగా కొందరు ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ నిలిచిచిన విషయం తెలిసిందే. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా ప్రక్రియ ముందుకు సాగుతోంది. కాగా, ప్రక్రియను డీఈవో ప్రణీత, ఏడీ నర్సింహులు, సిబ్బంది తుషార్, సతీశ్, శ్రీహరిబాబు, పూర్ణచందర్ తదితరులు నిర్వహిస్తున్నారు.