Skip to main content

Byjus Tabs at Schools: పాఠ‌శాల విద్యార్థుల‌కు, ఉపాధ్యాయుల‌కు ట్యాబ్‌ల పంపిణీ

గ‌తేడాది చేసిన‌ట్లుగానే ఈ ఏడాది కూడా పాఠ‌శాల‌లోని విద్యార్థుల‌కు, ఉపాధ్యాయుల‌కు బైజూస్ కంటెంట్‌తో ఇన్‌స్టాల్ చేసిన ట్యాబుల‌ను పంపిణీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ ట్యాబ్‌ల నిర్వాహం, వాటి ప‌ర్యావేక్ష‌ణ‌తో పాటు, ప‌లు చ‌ర్య‌ల గురించి పూర్తి వివ‌ర‌ణ‌...
School Technology Initiatives,Teachers explaining students about Byjus tabs for education, Digital Learning Tools
Teachers explaining students about Byjus tabs for education

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడేలా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఇందుకోసం బైజూస్‌ కంటెంట్‌తో ఇన్‌స్టాల్‌ చేసిన ట్యాబ్‌లను ఎనిమిదో తరగతి విద్యార్థులకు, బోధించే ఉపాధ్యాయులకు అందజేస్తోంది. వరుసగా రెండో ఏడాది కూడా ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతేడాది జిల్లాలో విద్యార్థులు, టీచర్లకు కలిపి మొత్తం 25,400 ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఇందుకోసం రూ. 81.28 కోట్లు ఖర్చు చేశారు. ఈ విద్యా సంవత్సరం దాదాపు రూ.83 కోట్లు వ్యయం చేస్తున్నారు.

AP students in Columbia University: అంతర్జాతీయ వేదికలో ప్రసంగించిన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు

ఈ ఏడాది కొత్తగా పదోన్నతులు పొందిన సబ్జెక్టు టీచర్లందరికీ ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. బైజూస్‌ ట్యాబ్‌లు కొనసాగింపుగా పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ ప్యానెల్‌, స్మార్ట్‌ టీవీల్లో కూడా బైజూస్‌ కంటెంట్‌ చూపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాబ్‌లు అందజేసే సందర్భంలో ప్రతి ట్యాబ్‌ను కూడా మూడేళ్ల వారంటీతో కొనుగోలు చేయనున్నారు. విద్యార్థులు ట్యాబ్‌లు ఉపయోగించే క్రమంలో అనుకోని పక్షంలో జరిగే స్క్రీన్‌ డ్యామేజీకి కూడా ప్రభుత్వమే రిపేరీ చేయించాలని నిర్ణయించింది.

నిరంతర పర్యవేక్షణ..

విద్యార్థులకు అందజేసిన ట్యాబ్‌లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణను ఏర్పాటు చేసింది. డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థుల ట్యాబ్‌లను పరిశీలిస్తున్నారు. వీరితోపాటు సచివాలయ సిబ్బంది, డిజిటల్‌ అసిస్టెంట్లు ప్రతినెలా కనీసం ఒక్కసారి ప్రతి పాఠశాలనూ సందర్శించి ట్యాబ్‌ల పనితీరును చెక్‌ చేస్తారు. ట్యాబ్‌ల రిపేరీ బాధ్యతలు కూడా వారే చూస్తారు. వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ ప్రతి వారం పాఠశాలను సందర్శిస్తారు. ప్రతి శుక్రవారం ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడి ట్యాబ్‌లకు వైఫై కనెక్ట్‌ చేసి వినియోగ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

UG Subjects: యూజీలో మేజ‌ర్ స‌బ్జెక్టుకు ప్ర‌ధాన ఎంపిక అమ‌లు

దుర్వినియోగం కాకుండా చర్యలు..

ట్యాబ్‌లను దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం ‘టెక్టోరో’ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ భాగస్వామ్యంతో ట్యాబ్‌ల్లో యూట్యూబ్‌, కెమెరా, ఇతర యాప్‌లు ఓపెన్‌ కాకుండా చర్యలు చేపట్టింది. మూడు యాప్‌ల (వైఫై, బైజూస్‌, డిక్షనరీ)ను అందుబాటులో ఉంచింది. అప్‌డేట్‌ చేయడానికి ఎంఆర్‌సీ సిబ్బంది, సీఆర్పీలకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, యాక్టివ్‌ టీచర్లు, డిజిటల్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి పాఠశాల స్థాయిలోనే అప్డేట్‌ చేయిస్తున్నారు. అప్‌డేట్‌ చేసే క్రమంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే హెల్ప్‌లైన్‌ (89770 10222, 89775 06444, 89776 09444) నంబర్లకు ఫోన్‌ చేయొచ్చు.

Student Success: క‌ళాశాల నుంచి యూనివ‌ర్సిటీలోకి సీటు సాధించిన విద్యార్థిని

డిసెంబర్‌లో ట్యాబ్‌ల పంపిణీ

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు డిసెంబర్‌లో ట్యాబ్‌లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా విద్యార్థులకు ఉపయోగపడేలా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను అందజేస్తోంది. గతేడాది పంపిణీ చేసిన ట్యాబ్‌లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంది. విద్యార్థులకు చాలా ఉపయోగపడుతున్నాయి.
– వి.నాగరాజు, డీఈఓ

మరమ్మతులకు స్పెషల్‌ డ్రైవ్‌

బైజూస్‌ కంటెంట్‌ కల్గిన ట్యాబ్‌ల మరమ్మతులకు రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ఈనెల ఒకటి నుంచి జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం. స్క్రీన్‌ రిపేరీ ఉంటే దాదాపు రూ.6 వేలకు పైగా ఖర్చు వస్తుంది. ఈ మొత్తం కూడా ప్రభుత్వమే భరించనుంది. వినియోగంపై తరచూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.

– ఓబుళరెడ్డి, బైజూస్‌ ట్యాబ్‌ల
జిల్లా నోడల్‌ అధికారి

Published date : 19 Sep 2023 12:51PM

Photo Stories