ZPHS High School: ఉపాధ్యాయుడు సస్పెండ్.. కారణం ఇదే..
బ్యాడ్ టచ్ టీచర్స్ శీర్షికతో ఏప్రిల్ 4 వ తేదీన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. దుద్దెడ హైస్కూల్లో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న భాకి చంద్రభానును అదే స్కూల్‌లో 10వ తరగతి పరీక్ష కేంద్రంలో ఇన్విజిలెటర్‌గా నియామకం చేశారు.
మార్చి 26న ఫిజిక్స్ పరీక్ష రాస్తున్న సోషల్ వెల్ఫేర్ స్కూల్‌కు చెందిన విద్యార్థినీతో భాకి చంద్రభాను అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో పరీక్షను సరిగా రాయలేకపోయానంటూ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ లక్ష్మికి ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.
చదవండి: Education Officers: చనిపోయినా పది మూల్యాంకనానికి రావాల్సిందే...!
ఈ విషయంపై మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక అందజేయాలని డీఈఓ కార్యాలయం నుంచి ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. దీనిపై విద్యార్థినీని, చీఫ్ సూపరింటెండెంట్‌ని, చంద్రభానును మార్చి 30న వేర్వేరుగా విచారించి రికార్డులతో సహ సేకరించిన నివేదికను ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి డీఈఓ కార్యాలయంలో అప్పగించారు.
ఈ విషయాన్ని డీఈఓ కలెక్టరు మనుచౌదరి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడు భాకి చంద్రభానును సస్పెండ్ చేస్తూ డీఈఓ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి ధ్రువీకరించారు.