Skip to main content

State Education Achievement Survey: 547 పాఠశాలల్లో సర్వే

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 547 ప్రభుత్వ, ప్రైవేట్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వేను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్నట్లు డీఈవో ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు.
DEO Pranitha announcing the forthcoming education assessment in Adilabad's schools.State Education Achievement Survey, DEO Pranitha addressing a group of people about the upcoming education survey in Adilabad Town,
547 పాఠశాలల్లో సర్వే

ఎంపిక చేసిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 3, 6, 9వ తరగతి విద్యార్థుల సామర్థ్యాల స్థాయిని పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. డైట్‌, బీఎడ్‌, మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు న‌వంబ‌ర్ 3నుంచి సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.

చదవండి: Science Congress Competitions: ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లో సైన్స్ కాంగ్రెస్ పోటీలు

తెలుగు, గణితం సబ్జెక్టుల్లో మూడో తరగతి విద్యార్థులకు 40 ప్రశ్నలు, ఆరో తరగతి విద్యార్థులకు 50 ప్రశ్నలు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు 60 ప్రశ్నలు ఇచ్చి వారి స్థాయిని పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.

Published date : 04 Nov 2023 09:18AM

Photo Stories