Skip to main content

DEO Rama Rao: విద్యార్థినులు ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలి

తొర్రూరు: విద్యార్థినులు ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలని డీఈఓ రామారావు అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో వారం రోజులుగా జీవన నైపుణ్యాలపై కొనసాగుతున్న అవగాహన శిబిరం సెప్టెంబ‌ర్ 25న‌తో ముగిసింది.
Students should develop self confidence
విద్యార్థినులు ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలి

ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థినులు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. బాలికలకు కౌమార దశ ఎంతో ముఖ్యమని, ఈ దశలో పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యార్థి దశలో క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం అలవర్చుకోవాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా జెండర్‌ అండ్‌ ఈక్విటీ సమన్వయకర్త విజయకుమారి, పాఠశాల ప్రత్యేకాధికారి బొజ్జ శైలజ, ఆర్పీలు శ్రీదేవి, దుర్గా భవాని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చదవండి:

YVT Chandrika: సైన్స్‌ సెమినార్‌లో మార్కాపురం విద్యార్థినికి అవార్డు

Acharya D Narayana Rao: టెన్త్‌లో మెరిట్‌ విద్యార్థికి నగదు బహుమతి

Published date : 26 Sep 2023 04:07PM

Photo Stories