Mana ooru Mana Chettu: పాఠశాల విద్యార్థుల కథలు.. చరిత్రకు శ్రీకారం
సెప్టెంబర్ 26న బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సబిత ‘మన ఊరు మన చెట్టు’పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ తరహా ప్రయత్నం దేశ చరిత్రలోనే తొలిసారి కావడం గొప్ప విషయమని, రాష్ట్ర విద్యార్థులు కలం పట్టి తమ ఊరి ప్రకృతిని అద్భుత కథలుగా మలచి దేశానికే మోడల్‌గా నిలిచారని కొనియాడారు.
33 జిల్లాలకు చెందిన విద్యార్థులు రాసిన కథలను 33 పుస్తకాలుగా తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించి విద్యార్థులకు అందించడం అభినందించదగిన విషయమన్నారు. బాల సాహిత్య విస్తృతికి కృషి చేయడమే కాకుండా రాష్ట్రంలో పుస్తక ప్రదర్శనలతో జ్ఞాన తెలంగాణ కోసం కృషి చేస్తున్న సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌ను మంత్రి సబిత శాలువాతో సన్మానించారు.
చదవండి: Education Sector: స్వర్ణయుగాన్ని తలపిస్తున్న విద్యా రంగం
కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి నామోజు, తెలంగాణ విద్యా మౌలికవసతుల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, ప్రొ. నారా కిశోర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డి. శ్రీపాల్‌రెడ్డి, బి. కమలాకర్‌రావు పాల్గొన్నారు.