Skip to main content

Tenth Class Exams 2024: 10జీపీఏ కోసం ప్రతీ రోజు ప్రత్యేక తరగతులు... వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద!!

10జీపీఏ కోసం ప్రతీ రోజు ప్రత్యేక తరగతులు... వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద!!
DEO advises daily special classes for 100% pass and 10 GPA in 10th grade.    District Education Officer Ramkumar encourages teachers to work hard for student success.   10జీపీఏ కోసం ప్రతీ రోజు ప్రత్యేక తరగతులు... వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద!!
10జీపీఏ కోసం ప్రతీ రోజు ప్రత్యేక తరగతులు... వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద!!

టేకుమట్ల: టెన్త్‌లో విద్యార్థులు పది జీపీఏ సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రామ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని గర్మిళ్లపల్లి ఉన్నత పాఠశాలను బుధవారం డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేసి, పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల నిర్వహణ, సిలబస్‌పై ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణతతోపాటు 10జీపీఏ కోసం ప్రతీ రోజు ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తూ విద్యాభ్యాసంలో ఆసక్తి కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పలు సలహాలు సూచనలు చేశారు.

Also Read : Mathematics Study Material

Published date : 02 Feb 2024 09:23AM

Photo Stories