10th class: విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థుల ప్రగతిని నిత్యం మూ ల్యాంకనం చేస్తూ.. వెనుకబడిన వారిపై ప్రత్యేక శద్ధ్ర తీసుకోవాలని డీటీడీవో రమాదేవి అన్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వంద రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ని ర్వహించిన గ్రాండ్ టెస్టు పేపర్లను జిల్లా కేంద్రంలో మూల్యాంకనం చేస్తున్నారు. ఈ మూల్యాంకన శిబి రాన్ని గురువారం డీటీడీవో సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ గ్రాండ్ టెస్టు ద్వారా విద్యార్థుల ప్రతిభ స్థాయిని నిర్ధారించి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. 2023– 24 విద్యా సంవత్సరంలో 1173 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని తె లిపారు. రోజువారీ స్లిప్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. ఉత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏసీ ఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, ఏటీడీవో క్షేత్ర య్య, డీఎస్‌వో మీనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: TS 10th Class TM Study Material