‘ఓక్రిడ్జ్’కు దీటుగా రాజ్‌భవన్ స్కూల్’
‘మన బస్తీ–మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1న రాజ్‌భవన్ స్కూల్‌లో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యుటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, టీపీసీసీ ప్రధానకార్యదర్శి, ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా రాజ్‌భవన్ స్కూల్‌కు మరుగుదొడ్లు ఆధునీకరణ, డ్యూయల్ డెస్క్ బెంచీలు 96, గ్రీన్ చాక్ బోర్డులు 16, పాఠశాల భవనం పెయింటింగ్ వేయించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ప్రైవేట్ పాఠశాలలకు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలకే వెళ్తాం.. అనే ఆలోచన వచ్చేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
చదవండి: Nick Vujicic: ఇక్కడ విద్యారంగం అద్భుతం
తెలంగాణలోని 26,095 సర్కార్ బడుల రూపురేఖలు మార్చాలని సీఎం కేసీఆర్ ‘మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి’ కార్యక్రమం చేపట్టారని, మొదటి విడతలో 9123 పాఠశాలలకు రూ.7289 కోట్లతో ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాజ్‌భవన్ పాఠశాలలో 1350 మంది విద్యార్థులు చదువుకోవడం ఎంతో సంతోషకరమని, 2022లో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం హర్షనీయమన్నారు. దీనిని ఇలానే కొనసాగిస్తూ.. ఉపాధ్యాయులు సొంత పిల్లలను చూసుకున్నట్లుగా ఇక్కడ చదివే ప్రతి విద్యారి్థని చూసుకోవాలన్నారు.
చదవండి: Tenth Class: విద్యార్థులకు యానిమేటెడ్ పాఠాలు
విద్యార్థులకు ఎలాంటి భోజనం అందిస్తున్నామో తెలిసేలా వారి తల్లిదండ్రులకు కూడా ఒకరోజు భోజనం ఏర్పాటు చేయాన్నారు. అనంతరం ఖాజానగర్, భోళానగర్‌లో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, జీహెచ్‌ఎంసీ డిప్యుటీ కమిషనర్ మోహన్ రెడ్డి, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓ సామ్యూల్ రాజ్, హైస్కూల్ హెడ్ మాస్టర్ కరుణశ్రీ తదితరులు ఉన్నారు.
చదవండి: ‘మనఊరు–మనబడి’ స్కూళ్ల ప్రారంభం