Skip to main content

School Education: ఆన్‌లైన్‌లో ప్రైవేటు స్కూళ్ల సమాచారం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు స్కూళ్ళ సమాచారం అందరికీ అందుబాటులో ఉండేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోంది.
School Education
ఆన్‌లైన్‌లో ప్రైవేటు స్కూళ్ల సమాచారం

స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ ఉన్నతాధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. పాఠశాల అనుమతులు ఇందులో పొందుపరుస్తున్నట్టు తెలిపారు. సరైన మౌలిక వస తులు, ఆట స్థలం, ఫైర్‌ సేఫ్టీ వంటివి లేని స్కూల్స్‌కు తెలంగాణ విద్యాశాఖ అనుమతినివ్వడం లేదు. దీంతో కొన్ని ప్రైవేటు స్కూల్స్‌ను అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నారు. ప్రవేశాల సమయంలో అనుమతి ఉన్నట్టు విద్యార్థుల తల్లిదండ్రు లను నమ్మిస్తున్నారు. పరీక్షలు మాత్రం అనుమతి ఉన్న స్కూల్స్‌ నుంచి రాయి స్తున్నారు. అయితే, పాఠశా లల అనుమతి, ఇతర వివరాలన్నీ ఇంతకాలం కేవలం జిల్లా అధికా రులు మాత్రమే విద్యాశాఖ వెబ్‌సైట్‌ ద్వారా చూసుకునే వీలుండేది. ఈ విషయాలేవీ తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతి లేని స్కూల్స్‌లో చేర్పించి, తరువాత ఇబ్బంది పడాల్సి వస్తోంది. 

చదవండి: టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్

ఫిర్యాదుల నేపథ్యంలో...:

ఈ విషయమై కొన్నేళ్ళుగా వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందరూ చూసుకునేలా ప్రైవేటు స్కూల్స్‌ సమాచారం పొందుపర్చాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల హైదరా బాద్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థినిపై వేధింపుల కారణంగా స్కూల్‌ అను మతి రద్దు చేశారు. దీనిపై పాఠశాల విద్యశాఖ విచారణ జరిపింది. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజ మాన్యం, ఇతరుల అభిప్రాయా లను సేకరించింది. వీటన్నింటినీ క్రోడీకరించి, ప్రభుత్వానికి అవసరమైన సిఫార్సులతో నివేదిక పంపుతున్నట్టు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవసేన తెలిపారు. 

చదవండి: టెన్త్ క్లాస్ - సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

Published date : 29 Oct 2022 01:10PM

Photo Stories