Teachers Union: ఏదో ఒక దారిలో ఓడీ ఇవ్వండి ప్లీజ్
ఎన్నికల కోడ్‌తో తమకేం సంబంధం అంటు న్నారు. ఓ దొడ్డిదారిని ప్రభుత్వానికి సూచిస్తు న్నారు. ఒక టీచర్ల యూనియన్ నేతలు ఇటీ వల సంబంధిత మంత్రిని కలిసి ఓడీ కోసం పట్టుబట్టినట్టు తెలిసింది. ఓడీ లభిస్తే గుర్తింపు పొందిన టీచర్ల యూనియన్ నేతలు బోధన విధులకు హాజరవ్వాల్సిన అవసరం ఉండదు. గతేడాది జనవరిలో ఇచ్చిన ఓడీ డిసెంబర్‌తో ముగిసింది. అప్పట్నుంచీ మళ్లీ ఓడీ కోసం టీచర్ల యూనియన్ నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
చదవండి: Teachers Recruitment Test (TRT): టీఆర్టీ పరీక్షలు వాయిదా?
ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఆలోచి స్తున్న సమయంలోనే తాజాగా అసెంబ్లీ ఎన్ని కల షెడ్యూల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఓడీ వెసులుబాటు ఇవ్వడానికి ఇప్పుడు కోడ్ అడ్డం కాదా?’అని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల ఓట్లను ప్రభావితం చేసేందుకే ఓడీ ఇచ్చారనే వాదన వస్తుందేమో అని మంత్రి కూడా అనుమానం వ్యక్తం చేయగా, ‘అదేం లేదు... పాత డేట్ వేసి, ఆదేశాలు ఇవ్వొచ్చు’అంటూ సదరు యూనియన్ నేతలు మంత్రి వద్ద అన్నట్టు తెలిసింది.