Tenth Class: ‘టెన్త్’లో మాస్ కాపీయింగ్ !
మార్చి 18న హిందీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉట్నూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నలు బయట కు వచ్చినట్లు తెలిసింది. వీటికి సంబంధించిన జవాబులను ఓ మైనార్టీ గురుకులం ఉపాధ్యాయుడు స్వయంగా ఇంటికి వెళ్లి పే పర్‌పై రాసి దానిని మళ్లీ అదే సెంటర్‌లో అందించినట్లు సమాచారం.
చదవండి: మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏర్పాట్లు... పది పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
ఈ విషయంపై సదరు ఉపాధ్యాయుడు, మరోవ్యక్తితో ఫోన్‌లో సంభాషణ ఆడియో బయటకు రావడం సంచలనం సృష్టించింది. అలాగే ఉపాధ్యాయుడు స్వయంగా పేపర్‌పై జవాబులు రాస్తున్న వీడియో కూడా బయటకు పొక్కింది. పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని అధికారులు ఓవైపు చెబు తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండడం గమనార్హం.
ఈ విషయ మై ఎంఈవో శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. మాస్‌కాపియింగ్‌పై కలెక్టర్, డీఈవోకు సమాచారం అందించినట్లు చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఈవో ఆదేశించారు. అలాగే ఉట్నూర్ డీఎస్పీ మార్చి 20న బాధ్యులను విచారించినట్లు చెప్పారు.