Skip to main content

మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి ఏర్పాట్లు... పది పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి ఏర్పాట్లు... పది పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి ఏర్పాట్లు... పది పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

నిజామాబాద్‌ అర్బన్‌: పదో తరగతి పరీక్షలు ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశా ఖ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షల నిర్వ హణ కోసం ఉన్నతాధికారులు 140 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి పరీక్ష కేంద్రాలకు సంబంధించి చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లుగా సీనియర్‌ ప్రధానోపాధ్యాయులను మాత్రమే కేటాయించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలను గుర్తించిన అధికారులు పరీక్షల నిర్వహణ అధికారులకు రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా సెల్‌ఫోన్లపై నిషేధం, ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని శిక్షణలో వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తిచేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ సెంటర్ల నిర్వహకులతో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు.

మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి ఏర్పాట్లు

పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా గట్టి ఏర్పా ట్లు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్రాల వద్ద పర్యవేక్షణతో పాటు, సీసీ కెమెరాల వినియోగం, ప్రశ్నాపత్రాలు సెంటర్‌కు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సెల్‌ఫోన్లు ఉపయోగించకుండా చూడడం లాంటి చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాల వల్ల 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. బయటి వ్యక్తులను లోపలికి అనుమతించబోరు. జిరాక్స్‌ సెంటర్లను సైతం మూసివేయించనున్నారు.

మేనేజ్‌మెంట్‌ స్కూళ్ల సంఖ్య విద్యార్థులు

  • ఎయిడెడ్‌ 7 485
  • ఆశ్రమ 3 34
  • బీసీ వెల్ఫేర్‌ 12 766
  • ప్రభుత్వ 25 1120
  • కేజీబీవీ 25 835
  • ప్రైవేటు 191 8695
  • మైనారిటీ 17 684
  • మోడల్‌ 10 945
  • రెసిడెన్సియల్‌ 3 207
  • సోషల్‌ వెల్ఫేర్‌ 9 677
  • ట్రైబెల్‌ వెల్ఫేర్‌ 2 147
  • జెడ్పీ 224 7298

మొత్తం 528 21,893

పరీక్ష రాయనున్న 21,893 మంది విద్యార్థులు

జిల్లాలో ఏడాది పదో తరగతి పరీక్షలకు సంబంధించి 21,893 మంది పరీక్షలు రాయనున్నారు ఇందులో బాలురు 11,158, బాలికలు 10,735 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రైవేటుగా 380 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు వరకు ఎగ్జామ్స్‌ కొనసాగుతాయి. ఈసారి నూతనంగా సైన్స్‌ సబ్జెక్టుకు సంబంధించి బయోలాజికల్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ పరీక్షలు వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగనుంది. హిందీ పరీక్ష మాత్రం మధ్యాహ్నం 12.50 గంటల వరకు జరగనుంది. అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రశ్నాపత్రాలు రెండు రోజుల క్రితమే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి.

ఏర్పాట్లు పూర్తిచేశాం

పదో తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తాం. ఎలాంటి లోపాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. మాస్‌ కాపీయింగ్‌కు తావు లేకుండా చేస్తున్నాం. ఇప్పటికే పరీక్ష నిర్వహణ అధికారులకు శిక్షణ ఇచ్చాం. సెల్‌ఫోన్ల పూర్తిగా నిషేధించడం జరిగింది.

Published date : 06 Mar 2024 03:42PM

Photo Stories