Kambhampati Venkatesh: బోధనలో మేటి.. సమాజసేవలో ఘనాపాటి
సత్తుపల్లి గాంధీనగర్ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు వెంకటేష్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. గేయాలతో గణిత బోధన చేస్తూ పిల్లల్లో ఆసక్తి పెంపొందిస్తున్న ఆయన విరామ సమయంలో సమాజ సేవ చేస్తున్నారు. 2010లో రేజర్ల ప్రాథమిక పాఠశాలలో నియామకమైన ఆయన సత్తుపల్లి గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. ఐదేళ్లు నిండిన తన కుమారుడు విహాన్‌ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు పాఠాలు బోధించే ఆయన పేద పిల్లలకు నోట్‌పుస్తకాలు, పిల్లలు బడికి వచ్చేలా ప్రేరణ కల్పి స్తారు. మరోపక్క 2018లో నిరుపేదలకు పాత వస్త్రాలు అందించేలా ‘వాల్ ఆఫ్ కై ండ్‌నెస్’ నిర్వహించారు. మిత్రులతో కలిసి చేతన ఫౌండేషన్ ద్వారా కోవిడ్ సమయంలో సేవలందించారు.
చదవండి: Teachers Day Special: బోధనలో వినూత్నం
అందుకున్న అవార్డులు
ఉత్తమ ఉపాధ్యాయుడిగా, సమాజ సేవకుడిగా వెంకటేష్‌ను పలు సంస్థలు సత్కరించాయి. అయితే, డాక్టర్ సి.నారాయణరెడ్డి నుంచి పొందిన సత్కారం మరువలేని జ్ఞాపకమని ఆయన చెబుతారు. అలాగే, మరికొ న్ని సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నారు.
చదవండి: Teachers Day: నాన్నే.. మొదటి గురువు.. గురువులకు వందనం...