Skip to main content

DEO D Madhavi: విద్యాప్రమాణాల పెంపునకే ‘ఉన్నతి’

జ్యోతినగర్‌: ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు పెంపొందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి ఉన్నతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డీఈవో డి.మాధవి అన్నారు.
increase in educational standards
విద్యాప్రమాణాల పెంపునకే ‘ఉన్నతి’

 ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని జెడ్పీ హైస్కూల్‌లో భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు మూడురోజులుగా ఇస్తున్న శిక్షణ సెప్టెంబ‌ర్ 6న‌తో ముగిసింది. 6 నుంచి 9వ తరగతుల విద్యార్థుల కోసం దీనిని రూపొందించారని, కార్యక్రమ ఆవశ్యకత, లక్ష్యాలు, విధివిధానాలు, వాచకాలు, బోధన ప్రణాళిక వంటి అంశాలపై శిక్షణ అందిస్తున్నామని స్పష్టం చేశారు.

పిల్లల స్థాయికి అనుగుణంగా బోధన ఎలా చేయాలో ఈ కార్యక్రమం తోడ్పడుతుందని అన్నారు. అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి షేక్‌, సెంటర్‌ ఇన్‌చార్జి ఇరుగురాల ఓదెలు, విమల, రవినందర్‌రావు, జక్కం శ్రీనివాస్‌, జగదీశ్వర్‌, రాజేశ్వరావు పాల్గొన్నారు.

చదవండి:

Employment Opportunities: నిరుద్యోగుల ‘ఉన్నతి’కి భరోసా

Telangana: విద్యాప్రమాణాల ‘ఉన్నతి’ కోసం ఈ ప్రోగ్రాం

Students: ఉన్నతి పథకంతో ప్రతి విద్యార్థికీ మేలు

Published date : 07 Sep 2023 03:26PM

Photo Stories