చిన్న బడిలో మందుబాబుల హల్‌చల్!
Sakshi Education
జైనథ్: అది మండల కేంద్రం నడి బొడ్డున ఉన్న ప్రాథమిక పాఠశాల. పక్కనే ప్రాచీన శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవాలయం.. సాధారణంగా బడి, గుడి ఉన్న ప్రాంతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు.
కానీ మందుబాబులు మాత్రం చిన్న బడిగా పిలవబడే ప్రాథమిక పాఠశాలనే అడ్డాగా చేసుకొని రాత్రివేళలో రెచ్చిపోతున్నారు. పాఠశాలకు చెందిన మల్గీల పక్కన, మెట్లపై మద్యం సిట్టింగ్ చేస్తున్నారు. పక్కనే సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లు అర్ధరాత్రి వరకు దొరుకుతుండటం మందుబాబులకు అనుకూలంగా మారింది.
చదవండి: Teachers Transfers and Promotions: మోడల్ బదిలీలు ఎప్పుడో?
తాగిన మైకంలో మెట్ల పక్కనే మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో విద్యార్థులతో పాటు సమీపంలోని వారు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Published date : 08 Jul 2024 01:39PM