Collector Sumith Kumar: విద్యాప్రమాణాల మెరుగుపై దృష్టి పెట్టండి
విద్యా ప్రమాణాలపై ప్రేరణ ఆధ్వర్యంలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి మండలాల ప్రాథమిక పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలల్లో నిర్వహించిన సర్వేపై నవంబర్ 6న కలెక్టరేట్‌లో ఎంఈవో, హెచ్‌ఎంలకు నవంబర్ 6న ఒక్క రోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు పఠనా సామర్థ్యంలో వెనుకబడి ఉంటున్నారని గుర్తించినట్టు చెప్పారు. దీనిపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు.
చదవండి: Samineni Koteswara Rao: ప్రభుత్వ విద్యార్థులకు ఉపకార వేతనాలు
ప్రాథమిక స్థాయిలో సక్రమంగా బోధిస్తే మధ్యలో బడి మానరని అన్నారు. తెలుగు, ఆంగ్ల భాష, చరిత్ర, సంస్కృతి, గణితం బోధించాలని సూచించారు. విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులతో ఉపాధ్యాయులు స్నేహ పూర్వక వాతావరణం ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
కేజీబీవీ పాఠశాలలో విద్యా ప్రమాణాలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల నుంచి తెలుసుకున్నారు. పాఠ్యాంశాలు చదవడం, రాయడంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈవో గౌరీ శంకరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండల రావు, ప్రేరణ ప్రోగ్రాం మేనేజర్ జి.నారాయణరావు, ఎంఈవోలు రామచంద్రరావు, సరస్వతి పాల్గొన్నారు.