విద్యార్థుల కోసం పనివేళల పొడిగింపు
Sakshi Education
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉద్యోగ నియామకాలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉన్న గ్రంథాలయ పని వేళలను మూడు గంటలు అదనంగా పెంచామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు బి.రాజేశ్వర్‌గౌడ్ చెప్పారు.
ఏప్రిల్ 10న జిల్లా గ్రంథాలయానికి రిటైర్డ్ తహసీల్దార్ అద్దంకి యతిరాజాచారి కొన్ని పుస్తకాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి ఉదయం ఆరు నుంచి రాత్రి 11 గంటల వరకు జిల్లా గ్రంథాలయం తెరిచే ఉంటుందన్నారు. హన్వాడలోని శాఖ గ్రంథాలయ కొత్త భవనానికి రూ.68 లక్షలు, కోయిల్‌కొండలో కొత్త నిర్మించేందుకు రూ.60లక్షలు మంజూరయ్యాయన్నారు. వెన్నచేడ్ రూ.13.50 లక్షలతో నిర్మించిన కొత్త భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..
TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం
Published date : 11 Apr 2023 05:22PM