Skip to main content

Exams: ఒకేరోజు ఒకే సమయంలో ఈ పరీక్షలు.. అధికారుల సమన్వయలోపం..

సాక్షి, హైదరాబాద్‌: విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ మధ్య సమన్వయలోపం విద్యార్థులకు శాపంగా మారింది.
Exams
ఒకేరోజు ఒకే సమయంలో ఈ పరీక్షలు.. అధికారుల సమన్వయలోపం..

ప్రస్తుతం ప్రవేశ పరీక్షల సీజన్‌ కావడంతో వివిధ రకాల సెట్‌ల నిర్వహణకు అధికారులు తేదీలు ఖరారు చేస్తున్నారు. ఈ తేదీలపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని ఆదర్శ పాఠశాల (మోడల్‌ స్కూల్‌)ల్లో ఆరోతరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్‌ 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థుల హాల్‌టికెట్లనూ వెబ్‌సైట్‌లో పెట్టింది.

చదవండి: School Education Department: 1–9 తరగతుల పరీక్షలు తేదీలు ఇవే..

మరోవైపు ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)ల పరిధిలో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ సీట్లలో ప్రవేశాల అర్హత పరీక్షను కూడా ఏప్రిల్‌ 16న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. రెండు పరీక్షలు ఒకే రోజు ఉండటంతో... ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏదో ఒక పరీక్షకు మాత్రమే హాజరయ్యే పరిస్థితి. ఒకే రోజు, ఒకే సమయంలో రెండు పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు అటు ఫీజు నష్టపోగా.. ఇటు ప్రవేశాల్లో అవకాశాన్ని కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది.

చదవండి: Private Schools: అమానుషం.. విద్యార్థులపై యాజమాన్యాల ప్రతాపం

Published date : 11 Apr 2023 02:48PM

Photo Stories