DEO Yadayah: జాతీయ ఇన్‌స్సైర్ పోటీలకు జిల్లా విద్యార్థులు
ఈ ఏడాది నిర్వహించే పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. జనవరిలో నిర్మల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రాజెక్టు ప్రదర్శనతో జాతీయస్థాయికి ఇద్దరు ఎంపికయ్యారు.
న్యూఢిల్లీలో అక్టోబర్ 9 నుంచి 11 వరకు నిర్వహించే జాతీయ పోటీలకు రాష్ట్రం నుంచి 26 మంది తమ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. ఇందులో జిల్లాకు చెందిన జిమ్మిసి మణిప్రసాద్, కందుల ఖుషీంద్రవర్మ కూడా తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తారని డీఈవో యాదయ్య తెలిపారు.
చదవండి: Inspiration Story of a Women: ఆవులే రైతులకు మనుషులకు జీవనాదాయం అంటున్న పద్మ
గతంలోనూ జాతీయస్థాయిలో మెరిసిన విద్యార్థులు..
విద్యార్థులు గతంలోనూ జాతీయస్థాయిలో మెరిశారు. సర్కారు బడిలో చదువుతున్న తన మేదస్సుకు పదునుపెట్టి జాతీయస్థాయిలో మల్లేపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థి జుమ్మిడి అంజన్న తనప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 2019–20లో జాతీయస్థాయి పోటీల్లో ఫీడింగ్ చాంబర్ ప్రాజెక్టుతో ఉత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచారు.
2019లో నెన్నెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నవీన్‌కుమార్ ఇన్‌స్పైర్ మనక్‌లో జాతీయస్థాయిలో ప్రోత్సాహక బహుమతి సాధించారు. చెరువులు, వాగులు, సరస్సుల్లో నిండిన చెత్తను సౌరశక్తి విధానం ద్వారా తొలగించటానికి రూపొందించిన గార్బేజ్ రిమూవర్ ఫర్ స్వచ్ఛ వాటర్ అనే ప్రదర్శనతో మెప్పించారు. 2020–21లో శ్రీచైతన్య పాఠశాలకు చెందిన సాయిలు సాయిశ్రీవల్లి రూపొందించిన రుతుమిత్ర కిట్ పరికరంతో జాతీయస్థాయిలో ఆకట్టుకుంది.