CP Sunil Dutt: క్రమశిక్షణ, సమయపాలనే ప్రధానం
ఈసందర్భంగా పరేడ్‌ను పరిశీలించిన సీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు సహాయకారిగా ఉండే ఏఆర్ ఉద్యోగులకు సమస్యను నిలువరించే సమయస్ఫూర్తి అసవరమని తెలిపారు. అయి తే, విధుల్లో ఉత్సాహంగా పనిచేసేలా నిరంతర శిక్షణ అవసరమని, అందుకే మొబిలైజేషన్ క్యాంపు ఏర్పాటుచేసినట్లు చెప్పారు.
అనంతరం ఫైరింగ్ ప్రాక్టీస్‌లో ప్రతిభ చూపిన ఉద్యోగులకు సీపీ జ్ఞాపికలు అందజేశారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ప్రసాద్‌రావు, కుమారస్వామి, ఏఆర్ ఏసీపీలు నర్సయ్య, సుశీల్ సింగ్, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, తిరుపతి, అప్పలనాయుడు పాల్గొన్నారు.
ఆపరేషన్ స్మైల్‌తో బంగారు భవిష్యత్
బాలలకు బంగారు భవిష్యత్ అందించాలనే లక్ష్యంతోనే బాలకార్మిక వ్యవస్థలో ఉన్న వారికి విముక్తి కల్పించేలా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ, పోలీ సులు, కార్మిక, శిశు సంరక్షణ శాఖ అధికారులతో కూడిన కమిటీల ఆధ్వర్యాన జనవరిలో నిర్వహించి న తనిఖీల్లో 70 మంది బాలలకు విముక్తి కల్పించి తల్లిదండ్రులకు అప్పగించామని వెల్లడించారు.