Education System: భ్రష్టుపడుతున్న విద్యారంగం
ఖమ్మంలోని నయబజార్ పాఠశాల ఆవరణలో రెండు రోజులుగా జరుగుతున్న టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక మహాసభలు ఫిబ్రవరి 12న ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హరగోపాల్ మాట్లాడుతూ సమాజానికి, సమాజ ఆలోచనలకు అంతరాయం ఉండగా, విద్యారంగానికి జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందన్నారు.
మత చాంధసవాదం ఎన్నికల వరకు వచ్చిందని తెలిపారు. అయితే, మతం అనేది వ్యక్తిగత విశ్వాసమని, దీన్ని రాజయాల్లో స్థానం ఇవ్వొద్దని సూచించారు. ఈ ఏడాది తర్వాత బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, టీపీటీఎఫ్ సమాజ చైతన్యం కోసం కృషి చేయాల్సి అవసరముందని హరగోపాల్ సూచించారు.
చదవండి: Inspire Competitions: ఇన్స్‌పైర్ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని..
వివిధ అంశాలపై ప్రసంగాలు
టీపీటీఎఫ్ మహాసభల్లో వివిధ రంగాల నిపుణులు పలు అంశాలపై మాట్లాడారు. భోపాల్ ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన బుర్రా రమేష్ ‘నూతన విద్యా విధానం – రాజ్యాంగ విలువలు’ అంశంపై మాట్లాడగా, ఐఎఫ్‌టీయూ జాతీయ కార్యదర్శి పి.ప్రసాద్ అంతర్జాతీయ పరిస్థితులు – ఫలితాలు, ప్రభావాలు అంశంపై, వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ ప్రభుత్వ విధానాలు – ఆర్థిక సంక్షోభంపై, ఏపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.నర్సింహారెడ్డి అంతరాల విద్య–ప్రజల హక్కు, ప్రభుత్వ బాధ్యత అంశంపై, హేతువాద రచయిత్రి చందనా చక్రవర్తి మహిళల స్థితిగతులు – కర్తవ్యాలు అంశంపై, మాట్లాడగా తొలుత మహాసభల సావనీర్‌ను హరగోపాల్ ఆవిష్కరించారు. అలాగే, ఈ మహాసభల్లో 14 తీర్మానాలు చేశారు.
చదవండి: Work Shop: మోహన్‌బాబు యూనివర్సిటీలో పారామెడికల్ విద్యార్థులకు వర్క్‌షాప్
ఈసమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.అశోక్‌కుమార్, పి.నాగిరెడ్డి, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు కె.లక్ష్మీనారాయణ, సహాధ్యక్షుడు మనోహర్‌రాజు, జిల్లా అధ్యక్షుడు ఏ.వీ.నాగేశ్వరరావు, ఎస్.విజయ్‌తో పాటు ముత్యాల రవీందర్, ఎస్.కనకయ్య, రవీందర్, పీ.కే.వేణుగోపాల్, ఎం.నాగిరెడ్డి ప్రకాశ్‌రావు, అజయ్‌బాబు, రామాచారి, శశిధర్‌రెడ్డి, నారాయణమ్మ, ఎస్.కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.
తీర్మానాలివే..
టీపీటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో చేసిన తీర్మానాల వివరాలను నాయకులు వెల్లడించారు. నూతన జాతీయ విద్య విధానాన్ని రద్దు చేయాలని, కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యనందించాలేఇ, ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విడనాడాలని, మహిళలు, దళితులపై జరుగుతున్న దాడుల నివారణకు దోషులను కఠినంగా శిక్షించాలని, కౌలు రైతుల సమస్యలను పరిష్కరించి రైతుల ఆత్మహత్యలు నివారించాలని, ఆదివాసీ, గిరిజన రైతులు సాగు చేసుకుంటన్న భూములకు పట్టాలివ్వాలని తీర్మానించారు. అలాగే, ప్రభుత్వ వైద్యరంగాన్ని పటిష్టం చేయటంతో కార్పొరేటు అనుకూల విధానాలను విడనాడాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలని, మూఢ నమ్మకాల నిరోధక చట్టాన్ని రూపొందించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు రద్దు చేసి, ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు కేటాయించాలని, కల్తీ, కాలుష్యాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలనే తదితర తీర్మానాలు చేసినట్లు తెలిపారు.