Skip to main content

Tenth Exams 2024 : ప్రభుత్వ పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

Tenth Exams 2024 - ప్రభుత్వ పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
Tenth Exams 2024 - ప్రభుత్వ పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
Tenth Exams 2024 - ప్రభుత్వ పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

ములుగు: జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని అన్నారు. మండల పరిధిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతో పాటు కాసిందేవిపేట, జంగాలపల్లి పాఠశాలలను ప్రార్థనా సమయంలో డీఈఓ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలన్నారు. పదోతరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు శ్రద్ధతో ప్రత్యేక తరగతులకు హాజరై పాఠ్యాంశాలలోని సందేహాలను, సంబంధిత విషయ నిపుణులతో నివృత్తి చేసుకుని అధ్యయనం చేయాలన్నారు. ఉపాధ్యాయులందరూ విధిగా ప్రార్థన సమయానికి ఐదు నిమిషాల ముందే పాఠశాలలకు చేరుకోవాలన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల షెడ్యూల్‌ ప్రకారం ఉదయం, సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులను నిర్వహించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలని సూ చించారు.

Also Read :  10th Class Preparation Tips

మెరుగైన ఫలితాలు సాధించేలా..

వెంకటాపురం(ఎం): పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని పిలుపునిచ్చారు. మండల పరిధిలోని జవహర్‌నగర్‌ ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. పరీక్షలంటే విద్యార్థులు ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్‌ బద్దం సుదర్శన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Published date : 10 Jan 2024 04:58PM

Photo Stories