Skip to main content

DEO Yadaiah: పిల్లలను రోజూ పాఠశాలకు పంపించాలి

బెల్లంపల్లి: పిల్లలను రోజూ బడికి పంపించాల ని జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య సూచించారు. సెప్టెంబ‌ర్ 23న‌ బెల్లంపల్లిలోని నంబర్‌–2 ఇంక్లైన్‌ పాఠశాలను స్టేట్‌లెవెల్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో భాగంగా ఆయన సందర్శించారు.
DEO Yadaiah
పిల్లలను రోజూ పాఠశాలకు పంపించాలి

 తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రమం తప్పకుండా పిల్లలను పాఠశాలకు పంపించడం అలవాటు చేయాలని సూచించారు. రోజువారీగా బడికి పంపించకుంటే విద్యార్థులకు పాఠాలు సరిగా అర్థం కావని, ఇంటి దగ్గర చదువుకునే వాతావరణాన్ని తల్లిదండ్రులు క ల్పించాలని, అడపాదడప పాఠశాలకు వెళ్లి పిల్ల ల చదువు గురించి ఉపాధ్యాయులను అడిగి తె లుసుకోవాలని సూచించారు.

చదవండి: Prof KC Reddy: ‘విద్యా విధానంలో మార్పులు గమనించాలి’

ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను చిన్నతనంలో నంబర్‌–2 ఇంక్లైన్‌బడిలో చదువుకుని ఈ స్థా యికి వచ్చానని చెప్పారు. సెక్టోరియల్‌ ఆఫీస ర్లు చౌదరి, సత్యనారాయణమూర్తి, ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ శ్రీని వాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

Published date : 25 Sep 2023 05:11PM

Photo Stories