Skip to main content

High Court: ఈ విద్యార్థికి సప్లిమెంటరీలో అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: కమలాపూర్‌ జెడ్పీ హైస్కూల్‌ నుంచి పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన వ్యవహారంలో ఐదేళ్లపాటు డిబార్‌కు గురైన విద్యార్థి దొండబోయిన హరీశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
tenth supplementary exam
ఈ విద్యార్థికి సప్లిమెంటరీలో అవకాశం

రెగ్యులర్‌ పరీక్షల సమయంలో రాయలేకపోయిన రెండు (ఇంగ్లిష్, మ్యాథ్స్‌) పరీక్షలను సప్లిమెంటరీలో రాసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 5న హరీశ్‌ హిందీ పరీక్ష రాస్తుండగా శివాజీ అనే వ్యక్తి వచ్చి ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడు. దీనిపై కేసు కూడా నమోదైంది. తర్వాత ఇంగ్లిష్‌ పరీక్ష రాసేందుకు హరీశ్‌ పరీక్ష కేంద్రానికి వెళ్లాడు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

అతడి దగ్గరున్న హాల్‌టికెట్‌ను తీసుకున్న డీఈవో పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై హై కోర్టును ఆశ్రయించిన హరీశ్‌.. సైన్స్, సోషల్‌ పరీక్షలు రాసేందుకు అనుమతి పొందాడు. అప్పటికే ఇంగ్లిష్, మ్యాథ్స్‌ పరీక్షలు ముగి శాయి. దీంతో వీటిని సప్లిమెంటరీలో రాసుకునే అవకాశం ఇవ్వాలని హరీశ్‌ తండ్రి డి.రాజు మే 11న వెకేషన్‌ బెంచ్‌ ముందు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సుధీర్‌కుమార్‌ విచారణ చేపట్టి మిగిలిన రెండు పరీక్షలను సప్లిమెంటరీలో రాసేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.  

చదవండి: SSC 2023: విద్యార్థి హరీశ్‌ రిజల్ట్‌ కాలమ్‌లో ‘మాల్‌ప్రాక్టీస్‌’

Published date : 15 May 2023 12:14PM

Photo Stories