Key to Success: చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
పట్టణంలోని లక్ష్మణ్‌గార్డెన్స్‌లో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో జనవరి 23న గజ్వేల్, రాయపోల్, వర్గల్ మండలాల్లోని 22 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు ‘కీ టూ సక్సెస్’ అనే ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల పట్ల భయం వద్దన్నారు.
బట్టీ పట్టి కాకుండా ఇష్టంగా చదువుకోవాలని, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని సూచించారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆందోళనకు గురికాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంతో పాటు మననం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విద్యార్థులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు నర్సింహులు, ఎంఈవో సునీత, మండల నోడల్ అధికారి కృష్ణ, రాష్ట్ర పూర్వ బాలవికాస్ ఇన్‌ఛార్జి సుఖేందర్, గ్రామసేవ మహాయజ్ఞం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట నర్సింహారెడ్డి, సత్యసాయి సేవా సమితి గజ్వేల్, బూర్గుపల్లి కన్వీనర్లు వెంకటేశం, బాలనర్సయ్య, ప్రతినిధులు లక్ష్మణ్, మహేష్, చంద్రారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.