Skip to main content

Best Teacher Award: ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సమ్మక్క

ఏటూరునాగారం: మండల కేంద్రానికి చెందిన పడిగా సమ్మక్క ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై ంది.
Teacher Excellence award  Best Educator Award in Savitribaipoole Tribute   best teacher sammakka  Savitribaipoole's Birth Anniversary Celebration

సావిత్రిబాయిపూలే 193 జయంతిని పురస్కరించుకుని జ‌నవ‌రి 7న‌ హైదరాబాద్‌లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాళ్ల ఎన్నిక జరిగింది. ఈ క్రమంలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎన్నికై న సమ్మక్క మండల కేంద్రంలోని నేతాజీనగర్‌ యూపీఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.

చదవండి: Balvikas: విలువల విద్యే ‘బాలవికాస్‌’ లక్ష్యం

ఆర్గనైజేషన్‌ వారు చేపట్టిన ఉత్తమ అవార్డుల ఎంపికలో సమ్మక్క సీనియార్టీని గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్‌, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా సమ్మక్కను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు, కాంగ్రెస్‌ నాయకుడు వీసం నర్సయ్యలు అభినందించారు.

Published date : 09 Jan 2024 09:49AM

Photo Stories