Balvikas: విలువల విద్యే ‘బాలవికాస్’ లక్ష్యం
సత్యసాయి బాలవికాస్ కోర్సు విద్యార్థుల అఖిల భారత 14వ స్నాతకోత్సవం, కృతజ్ఞతా పూర్వక వేడుకలు జనవరి 7న కూడా ఘనంగా జురిగాయి.
పలువురు పూర్వ విద్యార్థులు తమ అనుభవాలు పంచుకున్నారు. ఒడిశా రాష్ట్రం గంజాంకు చెందిన విద్యార్థులు సంప్రదాయ రణపా నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనభరచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను ఆర్‌జే రత్నాకర్ రాజు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి, వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య అందజేశారు.
చదవండి: National Education Policy: విద్యార్థులకు వృత్తివిద్య నైపుణ్యం
ఈ సందర్భంగా రత్నాకర్ రాజు మాట్లాడుతూ బాల్యంలోనే మంచి గుణాలు అలవర్చుకుంటే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్న లక్ష్యంతో బాలవికాస్ విద్యను సత్యసాయి ప్రవేశ పెట్టారని తెలిపారు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఈ విద్యా విధానానికి మంచి ఆదరణ ఉందన్నారు. కార్యక్రమంలో బాలవికాస్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.