స్కూలు పిల్లలకు ‘వనదర్శిని’ అవగాహన
పాఠశాల స్థాయి విద్యార్థుల నుంచే పర్యావరణ ప్రాధాన్యత, అటవీ పరిరక్షణ ఆవశ్యకతను గురించి వివరిస్తున్నారు. ఇందులో భాగంగా అడవులను కాపాడాలన్న సంకల్పాన్ని పిల్లల్లో కల్పనకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న వనదర్శిని కార్యక్రమానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. స్కూలు విద్యార్థులను అడవుల్లోకి తీసుకెళ్లి అక్కడి వివిధ రకాల చెట్లు, ఔషధ మొక్కల గురించి అటవీ అధికారులు పరిచయం చేశారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉండే అడవుల వల్ల ఉపయోగాలు, అడవులపై పెరుగుతున్న ఒత్తిడిని విద్యార్థులకు అర్థం అయ్యేలా వివరిస్తున్నారు.
చదవండి: Inspirational Story: పదో తరగతికే పెళ్లి... మూడేళ్లకే భర్త మృతి... కట్ చేస్తే ఇప్పుడామె‘ఆదర్శం’
తాజాగా మేడ్చల్ జిల్లా అటవీశాఖ నేతృత్వంలో కీసర రిజర్వ్ ఫారెస్ట్‌లో వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులను కీసర అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న కీసర ఎకో అర్బన్ పార్క్‌ను విద్యార్థులు సందర్శించి సేదతీరారు. విద్యార్థుల వనదర్శిని కార్యక్రమం వివరాలను ట్విట్టర్‌లో షేర్ చేసిన సంతోష్ ఆనందాన్ని వ్యక్తంచేశారు.
చదవండి: Tribal Women: అడవిని సృష్టించిన గిరిజన మహిళలు.. ఎలా అంటే..