జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సంగ్రహనాత్మక మూల్యాంకనం–2) బుధవారం ప్రారంభం అయ్యాయి.
పరీక్షను పరిశీలిస్తున్న డీఈఓ రాము
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధి పాఠశాలల్లో ఉదయం ఒకటి నుంచి ఐదవ తరగతి, మధ్యాహ్నం ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ రాము తెలిపారు. జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం జారీ చేసిన టైం టేబుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామాని హెచ్చరించారు. నెల్లుట్ల, రఘునాథపల్లి, రంగప్పచెరువు బాలికల పాఠశాల, సెయింట్ పాల్స్, సెయింట్ మేరీస్ పాఠశాలలను డీఈఓ బుధవారం సందర్శించారు. ఆయన వెంట డీసీపీ సహాయ కార్యదర్శి రామరాజు పాల్గొన్నారు.