TS Gurukulam Jobs Exam Dates and Time 2023 : గురుకుల కొలువులకు దరఖాస్తు చేసుకున్న అభ్యరులకు తీపి కబురు.. పరీక్షల తేదీలు ఇవే.. ఫలితాలను కూడా..
ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష తేదీలను వెల్లడించింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు నియామక బోర్డు అధికారులు వెల్లడించారు.
మొత్తం 9,210 పోస్టులకు గాను 2.63 లక్షల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్క పోస్టుకు సగటున 29 మంది అభ్యర్ధులు పోటి పడుతున్నారు. పోస్టుల వారీగా పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను రెండు రోజుల్లో తెలియజేస్తామని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు కన్వీనర్ డా. మల్లయ్య బట్టు తెలిపారు.
చదవండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు
పరీక్షలన్నీ సీబీఆర్‌టీ విధానంలోనే :
రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్న పత్రాల లీకేజి కారణంగా 9,210 గురుకుల పోస్టుల పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించాలని బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. పరీక్షలు నిర్వహించడానికి, ఫలితాలను వేగంగా ప్రకటించడానికి సీబీఆర్‌టీ విధానమే మంచిదని గురుకుల బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
TS Gurukulam Teacher Jobs: టీఎస్ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..
ఈ విద్యా సంవత్సరంలోనే నియామకాలు :
అక్టోబరు కల్లా ఫలితాలు వెల్లడించి, మెరిట్ జాబితాలను సిద్దం చేసి, అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, ఈ విద్యా సంవత్సరంలోనే నియామకాలను చేపట్టి బోధనలు మొదలు పెట్టాలని బోర్డు భావిస్తోంది.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్