Skip to main content

Teacher Jobs Notification 2023 : ఇక ఎన్నికల తర్వాతే.. డీఎస్సీ నోటిఫికేష‌న్‌..? ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియా­మకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఇక ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు నియామ‌కాల‌ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది.
TS Teacher Jobs Notification 2023 News in Telugu
TS Teacher Jobs Notification 2023

ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావుడి జరిగినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది.

గతేడాది(2022) టెట్‌ పరీక్ష సమయంలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆశతో ఎక్కువ మంది పరీక్ష రాశారు. కానీ ఏడాది గడచినా నియామకాలేవీ చేపట్టలేదు. దానికి తోడు పాఠశాలలో విద్యార్థులు 21 లక్షల మంది ఉంటే.. టీచర్లు ఏకంగా 1.03 లక్షల మంది ఉన్నారు. ఏటా అధిక సంఖ్యలో విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నందున సాధారణ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి.

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఈ అవకాశం దాదాపు లేనట్లే..
ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ చేసిన తర్వాతే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేలా నిర్ణయం తీసుకుందామని కీలక మంత్రి ఒకరు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అంటే ప్రస్తుతం టెట్ జరిపినా, ఎన్నికల తర్వాతే.. డీఎస్సీ (టీఆర్టీ) చేపట్టే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఎందుకంటే.. టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చే సరికి సెప్టెంబరు వస్తుంది. ఆ తర్వాత అక్టోబరులో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున ఇక టీఎస్సీ (TRT) జరిపే అవకాశం దాదాపు లేనట్లేనని స్పష్టమవుతోంది.

TS TET : అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ! ఇక‌పై టెట్‌ ఒక్కసారి రాస్తే..

టెట్‌కు లైన్‌క్లీయ‌ర్‌.. కానీ డీఎస్సీకి మాత్రం..
త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే కసరత్తు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. జూలై 7వ తేదీన (శుక్ర­వారం) హైదరాబాద్‌లో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం దీనికి ఆమోదం తెలిపింది. మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తల­సాని శ్రీనివాస్‌ యాదవ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన ఈ సమావేశంలో పాల్గొన్నా­రు.

☛ ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

విద్యాశాఖలో దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంశం ఇందులో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తవకుండా నియామకాలు చేపట్టలేమని అధికారులు మంత్రులకు వివరించినట్టు సమాచారం. దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తిని పోగొట్టేందుకు తక్షణమే టెట్‌ నిర్వహించాలని భావించినట్టు తెలిసింది. 

తొలిసారిగా..
రాష్ట్ర అవతరణ తర్వాత 2016లో తొలిసారిగా టెట్‌ నిర్వహించారు. తర్వాత 2017, 2022లలోనూ నిర్వహించారు. 2016 నుంచి టెట్‌ అర్హత పొందిన వారంతా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గతంలో విద్యాశాఖ అంచనా వేసింది. కానీ 12 వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామని ప్రభు­త్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరతతో చాలా పాఠశా­లల్లో బోధనకు ఇబ్బంది అవుతోంది.

☛ TS TET Paper-1: టెట్ పేప‌ర్-1 ప‌రీక్ష‌లో ఏఏ స‌బ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వ‌స్తాయంటే..?

☛ TS TET Paper-2: టెట్ పేప‌ర్-2 ప‌రీక్ష‌లో ఏఏ స‌బ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వ‌స్తాయంటే..?

టెట్‌ చేపట్టినా ఉపయోగం లేదు..
ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టిన నేపథ్యంలో ఈ సమస్య ఇంకా పెరిగింది. కొన్ని పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ)లను ఉన్నత తర­గతుల బోధనకు పంపుతున్నారు. కోర్టు వివాదాలకు దారి­తీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీలు ముందుకెళ్లడం లేదని.. టెట్‌ చేపట్టినా ఉపయోగం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.

పోస్టుల భర్తీ లేకుండానే అస‌లు టెట్‌ దేనికి..?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 22వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే లక్షల మంది టెట్‌ ఉత్తీర్ణులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే నియామకాలు చేపట్టవచ్చు. ఇవేవీ చేయకుండా టెట్‌ చేపడితే ప్రయోజనం ఏమిటని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి తెలిపారు.

☛ టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

Published date : 08 Jul 2023 05:42PM

Photo Stories