Skip to main content

Good News.. DSC Notification 2024 : గుడ్‌న్యూస్‌.. డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : త్వ‌ర‌లో తెలంగాణ‌లో డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో వేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా.. మరో 4,800 టీచర్ పోస్టులు, 2 వేల స్పెషల్ టీచర్ పోస్టులు, 1000 మోడల్ స్కూల్ టిచర్ పోస్టులు జత చేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు తుది కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.
TS DSC Notification News in Telugu

దీంతో 5089 పోస్టులకు తోడుగా 7800 నూతనంగా భర్తీ చేయడానికి చర్యలు చేపట్టారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య దాదాపుగా 13 వేలకు చేరుకోవచ్చు అని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు.

☛ TS డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఆ త‌ర్వాతే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం.. 
ఫిబ్రవరి మొదటి వారంలోగా డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండడం, అటు టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితి లేనందున వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ఆ లోపే గత ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీకి మరిన్ని పోస్టులు కలిపి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడమే మంచిదని అధికారులు భావిస్తున్నారు.

Published date : 24 Jan 2024 03:57PM

Photo Stories