‘డీఎస్సీ’ దివ్యాంగ అభ్యర్థులకు స్క్రైబ్స్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2018 పరీక్షలు రాసే దివ్యాంగ అభ్యర్థులకు స్క్రైబ్స్ కేటాయిస్తున్నట్టు పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి డిసెంబర్ 20న ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు మెడికల్ సర్టిఫికెట్‌లను పరీక్ష సెంటర్‌లో చూపించాలని పేర్కొన్నారు.
ఇంటర్ విద్యార్హత ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారిని స్క్రైబ్స్‌గా నియమిస్తామని పేర్కొన్నారు. విజువల్లీ చాలెంజడ్ అభ్యర్థులకు మాత్రమే 50 నిమిషాల అదనపు సమయం కేటాయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో అవసరమైన కంప్యూటర్ ఎగ్జామ్ సెంటర్లు లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో కేటాయించినట్లు తెలిపారు. టెట్-1 పరీక్షకు దాదాపు 16 వేల మంది, టెట్-2కు 9 వేల మందికి ఇతర రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించినట్టు వెల్లడించారు. ప్రస్తుత డీఎస్సీలో 4 వేల మంది అభ్యర్థులకు ఇతర రాష్ట్రాల్లో సెంటర్లను కేటాయించినట్టు సంధ్యారాణి వివరించారు.
Published date : 21 Dec 2018 03:56PM