డీఎస్సీ-2018 షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ- 2018కి సంబంధించి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి డిసెంబర్ 17న ఒక ప్రకటనలో వెల్లడించారు.
కొంతమంది అభ్యర్థులు పలు సబ్జెక్టులకు దరఖాస్తు చేయడం వల్ల వారు అన్ని పరీక్షలూ రాసేందుకే ఈ మార్పులు చేసినట్లు ఆమె వివరించారు. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఆమె వివరించారు. స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజెస్ పరీక్షలో కొన్ని సబ్జెక్టులు 28 తేదీకి బదులు 27వ తేదీ మధ్యాహ్నానికి మార్చామని చెప్పారు. అలాగే పీజీటీ సబ్జెక్టులు 29వ తేదీన ఉండగా తెలుగు, ఇంగ్లీషులను 28వ తేదీ మధ్యాహ్నానికి మార్చినట్లు వివరించారు. అలాగే పీజీటీలో సబ్జెక్టులు ఎక్కువగా ఉండటంతో వారికి 29వ తేదీతో పాటు 30న కూడా పరీక్ష నిర్వహించనున్నామన్నారు. మరో 24 మంది అభ్యర్థులకు వారి కాంబినేషన్‌లో పరీక్ష రాసుకునేలా ప్రత్యేక సెషన్లో పరీక్ష నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫోన్ల ద్వారా వీరికి సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నామన్నారు. అలాగే వీరికి ప్రత్యేకంగా హాల్ టికెట్లు కూడా ఇవ్వనున్నామని తెలిపారు. ఎస్జీటీ అభ్యర్థులు సెంటర్ల ఎంపికకు సంబంధించి డిసెంబర్ 18 నుంచి 24 వరకు ‘ cse.ap.gov.in ’ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆప్షన్లను పెట్టుకోవాలని కమిషనర్ సూచించారు.
పోస్టులు | గతంలో ప్రకటించిన షెడ్యూల్ | తాజా షెడ్యూల్ |
స్కూలు అసిస్టెంట్లు(భాషలు) | డిసెంబర్ 28 | డిసెంబర్ 27, 28 |
పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్స్ | డిసెంబర్ 29 | డిసెంబర్ 28, 29, 30, 31 |
ట్రైన్‌డ గ్రాడ్యుయేట్, ఫిజికల్ ట్రైనర్స్ | డిసెంబర్ 30 నుంచి జనవరి 1 | డిసెంబర్ 27, 31, జనవరి 1, 2 |
ప్రిన్సిపాల్స్, మ్యూజిక్, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ | జనవరి 2 | జనవరి 4న |
Published date : 18 Dec 2018 03:06PM