Skip to main content

8,792 పోస్టులకు టీఆర్‌టీ నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నోటిఫికేషన్ వెలువడింది.
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 31 జిల్లాలవారీగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ కేటగిరీ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఉంటే అభ్యర్థులు ఆయా కేటగిరీ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాత పరీక్షలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల ఎంపికనుబట్టి రాత పరీక్ష తేదీలను ఖరారు చేస్తామన్నారు. వీలైతే ఫిబ్రవరి 8వ తేదీ నుంచి పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగానే వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ల కోసం క్లిక్ చేయండి.
Education News లాంగ్వేజ్ పండిట్
Education News స్కూల్ అసిస్టెంట్
Education News సెకండరీ గ్రేడ్ టీచర్
Education News ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
Education News ఫిజికల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్)

అన్ని జిల్లాల్లో 20 శాతం ఓపెన్ కోటా...
ఇప్పటివరకు టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా ఎక్కువ పోస్టులు ఉన్న ఇతర జిల్లాల్లో 20 శాతం ఓపెన్ కోటాలో పోస్టుల కోసం ఆయా జిల్లాలకు వెళ్లి పరీక్ష రాయాల్సి వచ్చేది. దీంతో అభ్యర్థులు స్థానిక జిల్లాలో అవకాశాన్ని కోల్పోయే వారు. పైగా ఆ ఒక్క జిల్లాలో ఓపెన్ కోటాకే అర్హులయ్యేవారు. సొంత జిల్లాలోని పోస్టులకు పరీక్ష రాస్తే.. ఇతర జిల్లాలో 20 శాతం ఓపెన్ కోటాకు పరీక్ష రాసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఆందోళన అవసరమే లేదు. ఎక్కడ పరీక్ష రాసినా.. సొంత జిల్లాతోపాటు మిగతా అన్ని జిల్లాల్లోని 20 శాతం ఓపెన్ కోటా పోస్టులకు ప్రతి ఒక్కరూ అర్హులే. అప్షన్ ఇచ్చుకుంటే చాలు.. రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా సొంత జిల్లాలోని పోస్టులతో పాటు మిగతా అన్ని జిల్లాల్లోని ఓపెన్ కోటా పోస్టులకు ఆ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటారు. మెరిట్ ఉంటే ఇతర జిల్లాల్లో ఎక్కడైనా పోస్టును పొందవచ్చు. గతంలో మాదిరి ఓపెన్ కోటా పోస్టుల కోసం సొంత జిల్లాలో వదులుకొని ఇతర జిల్లాలకు వెళ్లి పరీక్ష రాయాల్సిన అవసరమే లేదు.

ఉదాహరణకు...: వరంగల్ అర్బన్ జిల్లాలో 22 పోస్టులే ఉన్నాయి. అదే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 319 పోస్టులు ఉన్నాయి. అంటే అక్కడ ఓపెన్ కోటాలో దాదాపు 60 పోస్టులు ఉంటాయి. ఇలాంటప్పుడు వరంగల్ అర్బన్‌లోని 22 పోస్టుల్లో ఓపెన్ కోటాలో, లోకల్ కోటాలో పోస్టు రాకపోతే.. సదరు అభ్యర్థులు ఇచ్చే ఆప్షన్‌ను బట్టి అతని మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఇతర జిల్లాల్లోని ఓపెన్ కోటాలో ఎక్కడైనా పోస్టు వస్తుందా? పరిశీలించి.. వస్తే ఆ పోస్టుకు ఎంపిక చేస్తారు.

టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ:
స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), లాంగ్వేజ్ పండిట్ (ఎల్‌పీ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసే వారు ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్) అర్హత సాధించి ఉండాలి. నియామకాల్లో ఆ టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ, టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్‌టీ) స్కోర్‌కు 80 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంపిక జాబితాను రూపొందిస్తారు. రాత పరీక్షను 80 మార్కులు 160 ప్రశ్నలతో నిర్వహిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఖరారు చేసిన సిలబస్ మేరకు ప్రశ్నలు ఉంటాయి. కేటగిరీలవారీగా పోస్టులు, అర్హతలు, సిలబస్ వివరాలను ( tspsc.gov.in, www.sakshieducation.com) వెబ్‌సైట్లలో పొందొచ్చు. సిలబస్ ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాల ఆధారంగా రూపొందించారు. అయితే సైన్‌‌స మ్యాథ్స్ వంటి వాటిల్లో కొన్ని ఫార్ములాల్లో ఇంటర్మీడియట్ వరకు లింకేజీ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున కేటాయిస్తారు. అన్ని కేటగిరీల పోస్టులకు ఒక్కొక్కటిగానే పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్‌‌స వంటి విధానం ఉండదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు పూర్తిగారాత పరీక్ష ఆధారంగానే నియామకాలు ఉంటాయి. దీన్ని 100 మార్కులకు నిర్వహించే అవకాశం ఉంది. వాటికి టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిన అవసరం లేదు.

964 ఇంగ్లిష్ మీడియం పోస్టులు...
రాష్ట్రంలో పలు పాఠశాలల్లో గతేడాది, ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినందున ఈసారి ఇంగ్లిష్ మీడియం టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం 964 ఇంగ్లిష్ మీడియం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. ఏ మీడియం వారికి ఆ మీడియంలోనే రాత పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు వేర్వేరు మీడియంలలోని పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని అంశాలు...
  • ఎస్‌జీటీ పోస్టులకు 7వ తరగతి వరకు సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
  • స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదో తరగతి వరకు సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. సైన్‌‌స, మ్యాథ్స్‌లలోని కొన్ని ఫార్ములాల్లో ఇంటర్మీడియెట్ వరకు లింకేజీ ఉంటుంది.
  • ఒక అభ్యర్థి నిర్దేశిత అర్హతలు, సంబంధిత మెథడాలజీ ఉంటే ఆయా కేటగిరీలకు చెందిన పోస్టులన్నింటికీ వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు తేదీలు, సమయాల్లోనే రాత పరీక్షలు ఉంటాయి.
  • అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 80, ఆన్‌లైన్ ప్రాసెస్ కింద రూ. 200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు పరీక్ష ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
  • గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు. దీనికి అదనంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి.
  • ఉపాధ్యాయ నియామక నిబంధనలతో కూడిన ఉత్తర్వుల (జీవో 25) ప్రకారమే అర్హతలు ఉంటాయి.
  • నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నాటికి అర్హతలు పొంది ఉన్న వారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఇదీ పరీక్ష విధానం...

విషయం

మార్కులు

ప్రశ్నలు

జనరల్‌నాలెడ్జి, కరెంట్ ఎఫైర్స్

10

20

పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్

10

20

సంబంధిత సబ్జెక్టు(భాష, ఇంగ్లిషు తదిరాలు)

60

120


ఇవీ కేటగిరీలవారీగా పోస్టులు..

స్కూల్ అసిస్టెంట్ -

1941

పీఈటీ -

416

స్కూల్‌అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) -

9

లాంగ్వేజ్ పండిట్ -

1011

సెకండరీ గ్రేడ్ టీచర్ -

5415

మొత్తం -

8,792


మీడియంవారీగా పోస్టులు...

ఇంగ్లిష్

964

హిందీ

516

ఉర్దూ

900

తెలుగు

6,303 + 9 (ఫిజికల్ డెరైక్టర్)

కన్నడ

31

మరాఠీ

53

తమిళం

5

బెంగాలీ

11


Education Newsజిల్లాలవారీగా పోస్టులు

జిల్లా

ఎస్‌జీటీ

ఎస్‌ఏ

ఎల్పీ

పీఈటీ

ఎస్‌ఏ (ఫిజికల్‌ఎడ్యుకేషన్)

మొత్తం

ఆదిలాబాద్

231

30

26

5

1

293

మంచిర్యాల

119

18

26

5

1

169

నిర్మల్

188

25

4

8

1

226

ఆసిఫాబాద్

776

45

66

7

0

894

కరీంనగర్

29

14

4

22

2

71

జగిత్యాల

31

141

53

27

1

253

పెద్దపల్లి

5

29

5

14

0

53

రాజన్న సిరిసిల్ల

1

37

8

30

0

76

నిజామాబాద్

98

33

18

9

0

158

కామారెడ్డి

220

52

82

26

1

381

వరంగల్ అర్బన్

0

8

1

13

0

22

వరంగల్ రూరల్

1

15

4

3

0

23

జయశంకర్ భూపాలపల్లి

152

86

54

27

0

319

జనగాం

1

34

15

10

0

60

మహబూబాబాద్

17

53

52

6

0

128

ఖమ్మం

0

39

10

8

0

57

భద్రాద్రి కొత్తగూడెం

80

36

64

5

0

185

మెదక్

152

86

39

3

1

281

రంగారెడ్డి

714

100

67

22

0

903

సిద్దిపేట

10

37

26

27

1

101

మహబూబ్‌నగర్

557

126

44

4

0

731

వనపర్తి

83

46

15

10

0

154

నాగర్ కర్నూల్

290

74

16

5

0

385

జోగుళాంబ గద్వాల

269

113

43

13

0

438

నల్లగొండ

26

110

37

17

0

190

సూర్యాపేట

8

106

27

15

0

156

యాదాద్రి

6

71

31

20

0

128

వికారాబాద్

593

135

86

6

0

820

మేడ్చల్

166

15

16

2

0

199

రంగారెడ్డి

386

74

49

12

0

521

హైదరాబాద్

206

153

23

35

0

417

మొత్తం

5,415

1,941

1,011

416

9

8,792

Published date : 23 Oct 2017 12:25PM

Photo Stories