TET పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెప్టెంబర్ 4న టెట్ నిర్వహణపై రెవెన్యూ, పోలీసు, విద్య, విద్యుత్, రవాణా, ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అర్హత పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్‌లో 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లు నిర్వహిస్తామన్నారు.
అభ్యర్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ అధికారులు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, సీసీ కెమెరాలు, తాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, డీఈవో అశోక్, ఆర్టీసీ డీఎం శ్రీధర్, డీటీవో గంధం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Telangana: టెట్ లో ఉత్తీర్ణత శాతం ఎందుకు పడిపోయింది..?