TET 2022: వెబ్‌సైట్‌లో పరీక్షల విధివిధానాలు
Sakshi Education
ఆగస్ట్‌లో నిర్వహించనున్న AP TET 2022 ఆన్‌లైన్ పరీక్షల విధివిధానాలను https://aptet.apcfss.inలో పొందుపరిచామని, తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టెట్ పరీక్షల్లో నార్మలైజేషన్ ప్రక్రియ అమలు చేయనున్నామని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ జూలై 8న ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: ఏపీ టెట్–2022 ముఖ్యమైన సమాచారం ఇదే..
సమగ్ర శిక్ష ఎస్పీడీగా అదనపు బాధ్యతలు
సమగ్ర శిక్ష ఇన్‌చార్జి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్పీడీ)గా పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జూలై 8న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీగా కొనసాగుతున్న కె.వెట్రిసెల్వికి కోవిడ్ 19 నిర్ధారణ కావడంతో ఆమెకు జూలై 29 వరకు మెడికల్ లీవ్ మంజూరు చేశారు. అప్పటి వరకు ఇన్‌చార్జ్ ఎస్పీడీగా సురేష్‌కుమార్ కొనసాగుతారు.
Published date : 09 Jul 2022 01:47PM