Collector VP Gautam: ‘TET’కు పకడ్బందీ ఏర్పాట్లు
Sakshi Education
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో టీచర్స్ ఎలిజిబులిటీ టెస్టు(టెట్) నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వీ.పీ.గౌతమ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
సెప్టెంబర్ 15న ఉదయం 9.30నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30నుంచి 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం పరీక్షకు 54 కేంద్రాలు ఏర్టాపుచేయగా 12,923 మంది, మధ్యాహ్నం పరీక్షకు 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా 10,480 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఇక కేంద్రాలకు బస్సుల ఏర్పాటు, నిరంతరాయ విద్యుత్ సరఫరాపై అధికారులు పర్యవేక్షిస్తారని కలెక్టర్ వెల్లడించారు.
చదవండి:
Published date : 07 Sep 2023 03:12PM