యూజీ అబ్రాడ్ !
Sakshi Education
విదేశీ విద్య అంటే.. ఎంఎస్, ఎంబీఏ వంటి మాస్టర్స్ కోర్సులేనా?
బ్యాచిలర్ డిగ్రీ తర్వాతే విదేశీ వర్సిటీలో అడుగుపెట్టాలా? ఇంటర్మీడియెట్‌తో విదేశీ విద్యకు అవకాశాలు లేవా..!? అంటే.. కచ్చితంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంటర్‌తోనే విదేశీ విద్యకు అడుగులు ప్రారంభించి.. అక్కడే యూజీ(అండర్ గ్రాడ్యుయేషన్), పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్) పూర్తిచేసి.. ఆ తర్వాత ఉద్యోగం కూడా సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. అంటే.. 18 ఏళ్ల వయసులోనే విదేశీ యూనివర్సిటీల్లో అడుగుపెట్టి ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసుకోవచ్చు. త్వరలో అన్ని దేశాల్లో ఫాల్ సెషన్ ప్రవేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్మీడియెట్ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు బెస్ట్ డెస్టినేషన్స్‌గా నిలుస్తున్న దేశాలు, ప్రవేశానికి అర్హతలు, పోస్ట్ స్టడీ వర్‌క పర్మిట్ అవకాశాలు తదితరాల గురించి తెలుసుకుందాం...
అమెరికా:
వీసా మంజూరు, విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు, ఉద్యోగ అనుమతుల పరంగా ఎన్ని నిబంధనలు అమల్లోకి వస్తున్నా.. మన విద్యార్థులకు మొదటి ప్రాథమ్యంగా నిలుస్తోంది అమెరికా. వాస్తవానికి మన దేశ విద్యార్థులు అధిక శాతం మంది ఎంఎస్, ఎంబీఏ వంటి పీజీ కోర్సులవైపే దృష్టిసారిస్తున్నారు. అమెరికాలో బ్యాచిలర్ డిగ్రీ చేయడానికీ బోలెడు అవకాశాలు ఉన్నాయి.
బీఏ, బీఎస్ :
అమెరికాలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు ప్రధానంగా రెండు విభాగాల్లో ఉంటాయి. అవి.. బీఏ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్). బీఏ పరిధిలోనే ఆర్ట్స్, కల్చర్, హ్యుమానిటీస్, అకౌంటింగ్, ఫైనాన్స్ తదితర నాన్ టెక్నికల్, సైన్స్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సులన్నీ బీఎస్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ బ్యాచిలర్ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. మొదటి రెండేళ్లు.. కరిక్యులం అన్ని ప్రోగ్రామ్‌లకు ఒకే మాదిరిగా ఉంటుంది. తర్వాత రెండేళ్లలో విద్యార్థులు తాము ఎంచుకున్న మేజర్ సబ్జెక్టుల సిలబస్ ఎక్కువగా చదవాలి. ఇలా తొలి రెండేళ్లు కామన్ కరిక్యులం విధానం ఫలితంగా విద్యార్థులకు తమ మేజర్ సబ్జెక్ట్‌లపైనే కాకుండా.. ఇతర అంశాలపైనా అవగాహన ఏర్పడుతుంది. ఫైన్‌ఆర్ట్స్, కల్చర్, ఫిలాసఫీ, బేసిక్ సైన్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. ప్రస్తుతం అమెరికాలో బ్యాచిలర్ డిగ్రీ బెస్ట్ మేజర్ సబ్జెక్ట్స్ పరంగా.. ఇంజనీరింగ్ తర్వాత బీఎఫ్‌ఏ, బీఎస్‌డబ్ల్యూ, బ్యాచిలర్ ఆఫ్ ఫిలాసఫీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ పబ్లిక్ అఫైర్స్ కోర్సులకు క్రేజ్ ఉంది.
ఓపీటీతో అక్కడే :
బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ చేతికందుకున్న తర్వాత అక్కడే ఉండాలనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న మార్గం.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ). ఈ విధానం ప్రకారం సంప్రదాయ డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ మేజర్ సబ్జెక్ట్ విభాగానికి సంబంధించిన పరిశ్రమల్లో 12 నెలలు పనిచేసే అవకాశం లభిస్తుంది. స్టెమ్ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు 24 నెలలు ఓపీటీతో అమెరికాలోనే ఉండొచ్చు. ఇందుకోసం కోర్సు పూర్తయ్యేనాటికి కనీసం ఆర్నెల్ల ముందుగా ఇమిగ్రేషన్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఓపీటీ పూర్తయ్యే సమయానికి ఏదైనా యూనివర్సిటీలో పీజీ కోర్సులో ప్రవేశం లభిస్తే ఎఫ్-1 వీసాను పొడిగించుకోవచ్చు.
పవేశ అర్హతలు..
కెనడా:
అమెరికా తర్వాత అన్ని రకాలుగా ఉత్తమ మార్గంగా నిలుస్తోంది.. కెనడా. ఈ దేశంలో అండర్ గ్రాడ్యుయేట్(బ్యాచిలర్ డిగ్రీ) కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. కొన్ని యూనివర్సిటీల్లో కో-ఆప్టెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వీటిని అభ్యసించే విద్యార్థులు కోర్సు వ్యవధిలో రియల్ టైం ప్రాక్టికల్స్ కోసం ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ కో ఆప్టెడ్ కోర్సుల వ్యవధి అయిదేళ్లు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ విభాగాల్లో కో-ఆప్టెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ. బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి స్టాండర్డ్ టెస్ట్‌లలో మంచి స్కోర్ ఉండాలి. కెనడాలో అధిక శాతం యూనివర్సిటీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటంతో ఫీజులు కొంత తక్కువే!
పీజీడబ్ల్యూపీపీ :
కెనడాలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తయ్యాక అక్కడే ఉండాలనుకునే విద్యార్థులకు చక్కని మార్గం.. పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్(పీజీడబ్ల్యూపీపీ). కనీసం ఎనిమిది నెలల వ్యవధి గల కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఈ వర్క్ పర్మిట్ పొందొచ్చు. ఇందుకోసం సర్టిఫికెట్ చేతికందిన 90 రోజులలోపు ఉద్యోగం పొందినట్లు స్పాన్సర్ లెటర్ ఆధారంగా ఇమిగ్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ వర్క్ పర్మిట్ వ్యవధి అభ్యర్థులు తాము పూర్తిచేసుకున్న కోర్సు వ్యవధికి సమానంగా ఉంటుంది.
పాపులర్ కోర్సులు: ఇంజనీరింగ్, బీబీఏ, ఫార్మసీ, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్.
వివరాలకు వెబ్‌సైట్: www.canada.ca/en/immigration-refugees-citizenship/services/study-canada.html
యూకే:
యూకేలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అవకాశాలు అనేకం! ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ విధానంలో ప్రత్యేకత శ్యాండ్‌విచ్ ప్రోగ్రామ్. దీని ప్రకారం విద్యార్థులు ఏడాది పాటు ప్రాక్టికల్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఇది కోర్సు మూడో ఏడాదిలో ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల కాల వ్యవధి సాధారణంగా మూడేళ్లు. కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో నాలుగేళ్లు ఉంటుంది.
వినూత్న ప్రవేశ విధానం:
ఇతర దేశాల్లో విద్యార్థులు ఆయా యూనివర్సిటీలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూకేలో మాత్రం యూనివర్సిటీ అండ్ కాలేజెస్ అడ్మిషన్ సర్వీస్ (యూసీఏఎస్) పేరుతో ఉమ్మడి ప్రవేశ విధానం అమలవుతోంది. అభ్యర్థులు ముందుగా యూసీఏఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. యూనివర్సిటీలకు ఆప్షన్లు ఇవ్వాలి. ఈ దరఖాస్తులను నిపుణుల కమిటీ పరిశీలించి అర్హుల జాబితాను రూపొందిస్తుంది. ఇందులో నిలిచిన విద్యార్థులు తాము ప్రవేశం పొందిన యూనివర్సిటీ ద్వారా స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.
పాపులర్ కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్, క్రియేటివ్ ఆర్ట్స్ అండ్ డిజైన్, బయలాజికల్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, లా.
అర్హత: 10+2 స్థాయిలో కనీసం 80 శాతంతో ఉత్తీర్ణత. టోఫెల్ (100 స్కోరు) లేదా ఐఈఎల్‌టీఎస్(6 - 6.5 బ్యాండ్స్) టెస్ట్ స్కోర్స్
పనిచేసే అవకాశం: గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న విద్యార్థులు టైర్-2 జనరల్ వీసాకు దరఖాస్తు చేసుకొని అక్కడే ఉద్యోగం పొంది కొనసాగొచ్చు. వార్షిక వేతనం కనీసం 20,800 పౌండ్లు ఉంటేనే ఈ వీసా మంజూరవుతుంది. ఈ వీసాతో అయిదేళ్ల వరకు అక్కడే నివసించొచ్చు.
వివరాలకు వెబ్‌సైట్: https:/www.britishcouncil.in/study-uk
ఆస్ట్రేలియా:
ఆస్ట్రేలియా యూనివర్సిటీలు అందించే సంప్రదాయ బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల కాల వ్యవధి మూడేళ్లు. ఆనర్స్ డిగ్రీ కావాలనుకుంటే అదనంగా మరో ఏడాది తాము ఎంపిక చేసుకున్న మేజర్ సబ్జెక్టును చదవాల్సి ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల పరంగా ఆస్ట్రేలియాలో అమలవుతున్న మరో వినూత్న విధానం.. TAFE (Technical and Further Education). దీని ప్రకారం.. ఆర్నెల్ల నుంచి రెండేళ్ల వ్యవధిలో యూనివర్సిటీలు వృత్తి విద్య, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేసుకున్న వారికి బ్యాచిలర్ డిగ్రీలో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందే అర్హత లభిస్తుంది.
యూజీ పూర్తయ్యాక:
బ్యాచిలర్ డిగ్రీ పూర్తయ్యాక వీసా సబ్‌క్లాస్-485 విధానం ప్రకారం విద్యార్థులు తమ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగాన్వేషణ సాగించి.. అక్కడే కొనసాగేందుకు.. గ్రాడ్యుయేట్ వర్క్ స్ట్రీమ్, పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పాపులర్ కోర్సులు: అగ్రికల్చర్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, నర్సింగ్, నేచురల్ సెన్సైస్, డెయిరీ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ లిటరేచర్, సోషల్ సెన్సైస్, ఫిలాసఫీ, లింగ్విస్టిక్స్.
వివరాలకు వెబ్‌సైట్: https://www.studyinaustralia.gov.au
సింగపూర్ :
యూకే, యూఎస్‌లతో పోల్చితే సింగపూర్‌లో బ్యాచిలర్ కోర్సులకు ఖర్చు తక్కువ. అంతేకాకుండా సింగపూర్ యూనివర్సిటీలు.. ఇతర దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాలతో ఒప్పందం చేసుకొని డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయి. దాంతో మన దేశం నుంచి బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల కోసం సింగపూర్ వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ వ్యవధి అభ్యర్థులు ఎంపిక చేసుకున్న మేజర్ సబ్జెక్టు ఆధారంగా మూడు నుంచి నాలుగేళ్ల వ్యవధిలో ఉంటుంది. ఇక్కడ కూడా ఆనర్స్ డిగ్రీ విధానం అమలవుతోంది. విద్యార్థులు తమ డిగ్రీ సాధారణ వ్యవధికి అదనంగా ఒక ఏడాది అభ్యసిస్తే సంబంధిత సబ్జెక్టులో ఆనర్స్ డిగ్రీ సర్టిఫికెట్ అందుకోవచ్చు.
పోస్ట్ స్టడీ వర్క్ :
సింగపూర్ కూడా బ్యాచిలర్, ఆపై స్థాయి విదేశీ విద్యార్థులకు పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలను అందుబాటులో ఉంచుతోంది. సర్టిఫికెట్ చేతికందిన తర్వాత అభ్యర్థులు స్టూడెంట్ పాస్ పేరుతో ఏడాదిపాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు.
పాపులర్ కోర్సులు: ప్రస్తుతం యూజీ, పీజీ స్థాయిలో మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, ఫైనాన్స్ పాపులర్ కోర్సులు.
వివరాలకు వెబ్‌సైట్: https://www.moe.gov.sg/admissions
జర్మనీ:
రీసెర్చ్ యాక్టివిటీస్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్న దేశం జర్మనీ. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల వ్యవధి మూడు నుంచి మూడున్నరేళ్లుగా ఉంటోంది. ప్రధానంగా ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీలో చేరే సమయానికి 13ఏళ్ల పూర్వవిద్యను పూర్తిచేసుకోవాలి. మన దేశ విద్యార్థులకు ఇంటర్మీడియెట్ వరకు 12 ఏళ్ల వ్యవధిలోనే విద్యాభ్యాసం ఉంటుంది. ఇలాంటి విద్యార్థులకు ఏడాది వ్యవధిలో ఉండే బ్రిడ్జ్ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నారు. ఇది పూర్తయ్యాక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి బ్యాచిలర్ డిగ్రీలో ప్రవేశం లభిస్తుంది. ఇక్కడి యూనివర్సిటీలో ప్రవేశానికి జర్మన్ భాషపై అవగాహన ఉండటం తప్పనిసరి. జర్మన్ లాంగ్వేజ్ నైపుణ్యానికి సంబంధించి బి-1 స్థాయి సర్టిఫికెట్ పొందాలి.
ఉద్యోగాన్వేషణ: బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసుకున్న అభ్యర్థులు తమ సబ్జెక్టుకు సంబంధించిన రంగంలో ఉద్యోగాన్వేషణ సాగించేలా అక్కడే ఏడాదిన్నరపాటు నివసించేలా సరళీకృత విధానం అమలవుతోంది. ఈ వ్యవధిలో ఉద్యోగం లభిస్తే జర్మన్ రెసిడెన్స్ పర్మిట్ లేదా ఈయూ బ్లూ కార్డ్ లభిస్తుంది. ఈయూ బ్లూ కార్డ్ లభిస్తే జర్మనీతోపాటు యూరోపియన్ యూనియన్‌లోని ఇతర దేశాల్లోనూ పనిచేసే అవకాశం ఉంటుంది.
పాపులర్ డిగ్రీ కోర్సులు: ఇంజనీరింగ్, నేచురల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, లైఫ్ సెన్సైస్.
వివరాలకు వెబ్‌సైట్: www.study-in.de/en
బ్యాచిలర్ డిగ్రీ.. ఫీజుల వివరాలు...
1. అమెరికా: 20 వేలు-30 వేల డాలర్లు
2. కెనడా : 10 వేలు-20 వేల డాలర్లు
3. యూకే : 20 వేలు-40 వేల డాలర్లు
4. సింగపూర్ : 24 వేలు-30 వేల డాలర్లు
5. ఆస్ట్రేలియా : 9 వేలు-14 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు
6. జర్మనీ : 500 నుంచి 2 వేల యూరోలు
అవసరమైన పత్రాలు..
1. కవరింగ్ లెటర్
2. రెజ్యూమె
3. అకడమిక్ సర్టిఫికెట్లు
4. పాస్‌పోర్ట్
5. ప్రవేశ ధ్రువీకరణ పత్రం
6. ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్
7. లెటర్ ఆఫ్ రికమండేషన్స్
8. స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్
అర్హతలు :
1. ఇంటర్మీడియెట్ (10+2)లో 75శాతం నుంచి 90 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
2. టోఫెల్‌లో 100 స్కోరు
3. ఐఈఎల్‌టీఎస్‌లో 6-6.5 బ్యాండ్స్.
4. శాట్‌లో 1300-1500 పాయింట్లు.
5. ఏసీటీలో 25 నుంచి 30 పాయింట్లు.

- Add your content... 10+2 (ఇంటర్మీడియెట్) తత్సమాన కోర్సులో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
- శాట్‌లో 1300-1500 మధ్యలో స్కోర్, ఏసీటీలో 25 నుంచి 30 మధ్యలో స్కోర్.
- టోఫెల్‌లో 95 నుంచి 100 పాయింట్లు లేదా ఐఈఎల్‌టీఎస్‌లో 6 బ్యాండ్స్.

Published date : 02 Aug 2018 11:56AM