విదేశీ విద్యకు ఆ రెండే కీలకం!
Sakshi Education
విదేశీ వర్సిటీలో ప్రవేశించాలంటే.. ముఖ్యంగా కావలసినవి..చక్కటి అకడమిక్ రికార్డ్! అద్భుతమైన స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్! ఆర్థిక స్థోమత! ఆకట్టుకునే రీతిలో రెజ్యుమే! స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులకు.. గుర్తొచ్చే అంశాలివే!! వీటితోపాటు మరో రెండు ఎంతో కీలకం అంటున్నారు నిపుణులు. అవే... స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్‌వోపీ).. లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్‌వోఆర్)!! ఎస్‌వోపీ.. ఎల్‌వోఆర్ గురించి తెలుసుకుందాం..
ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మొదలు.. విదేశాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల పరంగా ఆయా వర్సిటీల దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. అకడమిక్ రికార్డ్‌లు, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్‌కే పరిమితం కాకుండా.. విద్యార్థులు అందించే స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్(ఎస్‌వోపీ), లెటర్ ఆఫ్ రికమండేష(ఎల్‌వోఆర్)న్లు ప్రవేశాలు ఖరారులో అత్యంత కీలకంగా మారుతుండటం తాజా పరిణామం. కొన్ని సందర్భాల్లో సర్టిఫికెట్లు, స్కోర్స్ పరంగా ఎంత ముందంజలో ఉన్నా.. ఎస్‌వోపీ, ఎల్‌వోఆర్‌లు సరిగా లేక నిరాశ చెందుతున్న వారెందరో! ఇదే సమయంలో సదరు సర్టిఫికెట్లు, అకడమిక్ రికార్డ్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ఎస్‌వోపీ, ఎల్‌వోఆర్‌లతో మెప్పించి ప్రవేశం ఖాయం చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది !!.
భవిష్యత్తు లక్ష్యం ప్రతిబింబించేలా.. ఎస్‌వోపీ
విదేశీ వర్సిటీల్లో ప్రవేశం దిశగా అభ్యర్థులు తమ దరఖాస్తుతోపాటు తప్పనిసరిగా జత చేయాల్సిన పత్రం.. ఎస్‌వోపీ (స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్). ఎస్‌వోపీలో అభ్యర్థులు తమ భవిష్యత్తు లక్ష్యం, సదరు యూనివర్సిటీలో సంబంధిత కోర్సు పూర్తి చేయడం ద్వారా ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ఉన్న సానుకూలతలను తెలియజేయాలి. ఇందులో పేర్కొనే అంశాల ఆధారం గా విద్యార్థికి సదరు కోర్సు పట్ల ఉన్న ఆసక్తిని, అంకి తభావాన్ని అడ్మిషన్ల రివ్యూ కమిటీ ఇట్టే పసిగట్టేస్తుం ది. ప్రవేశాలను ఖరారు చేసే క్రమంలో ఎస్‌ఓపీలకు 30శాతం నుంచి 40 శాతం వరకూ ప్రాధాన్యం లభిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. జీమ్యాట్, జీఆర్‌ఈ, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్.. ఇలా స్కోర్లు ఎంట్రీ పాస్‌లుగానే మారుతున్నాయనడంలో సందేహం లేదు. ఎస్‌ఓపీ ఎంత బెస్ట్‌గా ఉంటే ప్రవేశ అవకాశాల్లో అంత ఫస్ట్‌గా నిలవొచ్చు.
కాపీ పేస్ట్ విధానం వద్దు
ఎస్‌వోపీలను రూపొందించే క్రమంలో చాలామంది విద్యార్థులు అప్పటికే ఆయా విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశంపొందిన వారు అందజేసిన వాటిని గుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు. దీనివల్ల ప్రతికూల అభిప్రాయం కలుగుతుందని గుర్తించాలి. అకడమిక్ రికార్డ్, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్‌లో ఉత్తమ ప్రతిభ ఉన్నప్పటికీ.. విద్యార్థికి తనకంటూ స్వీయ అభిప్రాయాలు, లక్ష్యాలు ఉండాలని విదేశీ వర్సిటీలు భావిస్తున్నాయి. ఎస్‌ఓపీలో ఇతరులను అనుసరించే విద్యార్థులు భవిష్యత్తులో సొంతంగా ఎలా రా ణించగలరు? అని అడ్మిషన్ కమిటీలు ఆలోచిస్తున్నాయి.
ఎస్‌వోపీల్లో పరిశీలిస్తున్నవివే
సదరు విద్యార్థి వినియోగించిన పదజాలం(టెర్మినాలజీ). భవిష్యత్తు లక్ష్యం.
ఆ లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం.
ఆ దిశగా ఇప్పటికే ఏమైనా సాధించి ఉంటే వాటి వివరాలు.
సుస్థిర కెరీర్ పరంగా.. ఆ లక్ష్యం చేరుకునేందుకు తమ యూనివర్సిటీ, అందులో ప్రవేశం కోరుకుంటున్న కోర్సు ద్వారా మార్గం సుగమం అయ్యే అవకాశంపై విద్యార్థికున్న నిర్దిష్ట అభిప్రాయం.
కోర్సు పూర్తయిన తర్వాత ఉన్నత అవకాశాల సాధన దృక్పధం.
సూటిగా.. స్పష్టంగా
చాలామంది విద్యార్థులు ఎస్‌వోపీలో క్లిష్టమైన పదాలను వినియోగిస్తారు. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ స్థాయిలోని నిపుణులను ఆకట్టుకోవచ్చని భావిస్తారు. వాస్తవానికి ఎస్‌వోపీలో రాసే పదజాలం సూటిగా, స్పష్టంగా ఉండాలి. భవిష్యత్తు లక్ష్యం, దానికి కారణాలు, ఆ దిశగా ఇప్పటికే సాధించిన విజయాల పరంగా.. తమకు ఆసక్తి కలిగించిన అంశాలను ప్రస్తావించి.. అవి తన లక్ష్యంగా మార్చిన కారణాలు తెలియజేయడం ఎంతో ఉపకరిస్తుంది. పాఠశాల, హైస్కూల్, కాలేజ్ స్థాయిలో సదరు లక్ష్య సాధనకు ఊతమిచ్చేలా ఏవైనా ఈవెంట్లలో పాల్గొంటే వాటిని ఉదహరించొచ్చు. ఇదంతా సూటిగా, స్పష్టంగా, సరళంగా ఉండాలి. యూనివర్సిటీలు ప్రవేశ దరఖాస్తు నిబంధనల్లోనే ఎస్‌వోపీ ఎన్ని పదాల్లో ఉండాలో నిర్దిష్టంగా పేర్కొంటున్నాయి. మరికొన్ని వర్సిటీలు దరఖాస్తులో ఎస్‌వోపీని ఒక ప్రశ్నగా చేర్చి.. దానికి సమాధానం ఇచ్చేందుకూ పద పరిమితిని నిర్దేశిస్తున్నాయి. ఔత్సాహిక విద్యార్థులు దీనిని పరిగణనలోకి తీసుకొని పద పరిమితి మించకుండా చూసుకోవాలి.
ఎల్‌వోఆర్..ముఖ్యమే
ప్రవేశ ప్రక్రియలో కీలకంగా మారుతున్న మరో సాధనం.. ఎల్‌వోఆర్(లెటర్ ఆఫ్ రికమండేషన్). విద్యార్థికి సదరు కోర్సులో చేరేందుకు ఉన్న అర్హతలు, అప్పటికే దానికి సంబంధించి విద్యార్థి పొందిన నైపుణ్యాలను వివరిస్తూ.. ఆ రంగంలోని ఇద్దరు నిపుణులు ‘అభ్యర్థికి అవకాశం కల్పించొచ్చు’ అంటూ సిఫార్సు లేఖ రాయడమే... ఎల్‌వోఆర్. కాబట్టి విద్యార్థులు తమ పూర్వ అధ్యాపకులు/ప్రొఫెసర్ల ద్వారా వాటిని పొందడం మేలు చేస్తుంది.
ఇండస్ట్రీ నిపుణులైనా సరే
ఇటీవల కాలంలో కొన్ని యూనివర్సిటీలు ఇండస్ట్రీ నిపుణులు ఇచ్చే ఎల్‌వోఆర్‌లకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని గమనించొచ్చు. ముఖ్యంగా అకడమిక్ కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్ చేసిన విద్యార్థులు.. సదరు సంస్థల్లోని విభాగాధిపతుల నుంచి ఎల్‌ఓఆర్‌లు పొందొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విదేశీ విద్య ఔత్సాహికులు తాము ఇంటర్న్ ట్రైనీగా పనిచేసే క్రమంలోనే సంస్థలో చక్కటి పనితీరు కనబరిస్తే.. విదేశీ వర్సిటీకి దరఖాస్తు చేసుకునే సమయంలో ఎల్‌వోఆర్ ఇచ్చేందుకు సదరు సంస్థ ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించడానికి మార్గం సుగమం అవుతుంది.
సంప్రదిస్తే స్పందించేలా
ఎల్‌వోఆర్‌ల విషయంలో ఇటీవల కాలంలో యూనివర్సిటీలు అనుసరిస్తున్న మరో విధానం.. సదరు ఎల్‌ఓఆర్‌లను ఇచ్చిన వారిని ఫోన్ లేదా ఈ-మెయిల్ ద్వారా సంప్రదించడం. ఈ విషయాన్ని కూడా విద్యార్థులు ఎల్‌వోఆర్ ఇచ్చిన ప్రొఫెసర్లు లేదా ఇండస్ట్రీ నిపుణులకు ముందుగానే తెలియజేసి సంసిద్ధంగా ఉంచాలి. అకడమిక్‌గా తమ ప్రతిభకు సంబంధించి మంచి అవగాహన ఉన్న ప్రొఫెసర్లు, అదే విధంగా ఇంటర్న్ ట్రైనీ సమయంలో తమ పనితీరు గురించి మూల్యాంకన చేసిన సంస్థల ప్రతినిధుల నుంచి ఎల్‌వోఆర్‌లు పొందడం ప్రయోజనకరం.
ఇలా చేస్తే మేలు
అకడమిక్‌గా తమ పనితీరు గురించి బాగా తెలిసిన ప్రొఫెసర్ల నుంచ ఎల్‌ఓఆర్ పొందడం.
ఇండస్ట్రీ నిపుణుల విషయంలో తాము ఇంటర్న్‌షిప్ చేసిన సంస్థల ప్రతినిధుల నుంచి ఎల్‌ఓఆర్ తీసుకోవడం.
వర్సిటీ అధికారులు సంప్రదిస్తే వారు సానుకూలంగా స్పందించేలా ముందుగానే అప్రమత్తం చేయడం.
ఎల్‌వోఆర్‌లో అకడమిక్స్‌తోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనూ చురుగ్గా పాల్గొంటాడని ప్రస్తావించడం.
ప్రాక్టికల్ ఓరియెంటెడ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇస్తాడనే రీతిలో ఎల్‌ఓఆర్‌లో పేర్కొనడం మేలు చేస్తుంది.

Published date : 20 Jan 2018 02:34PM