Skip to main content

ఉజ్వల భవితకు ఉత్తమ గమ్యం ఇలా..

అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గత దశాబ్దికాలంలో దాదాపు రెట్టింపు కావడం విశేషం.
ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులుగా అమెరికాలో డిగ్రీపై మీరు పెడుతున్న పెట్టుబడి మీ విజయవంతమైన భవిష్యత్తుకోసం పెడుతున్న పెట్టుబడిగా భావించేందుకు అవసరమైన ప్రతి ఒక్క అంశాన్ని అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థలు మనసులో ఉంచుకుంటూ తదనుగుణంగా వ్యవహరిస్తారుు. అమెరికాలో చదవడం అనే మీ స్వప్నాన్ని మీరు ఇప్పటికీ సాకారం చేసుకోవచ్చు. ప్రతిదీ అనిశ్చితంగానే కనిపిస్తున్న ఈ కష్టకాలంలో, అమెరికన్ డిగ్రీ అనేది మీదైన ప్రపంచాన్ని విస్తరింపజేసే శక్తివంతమైన మార్గాన్ని ప్రతిపాదిస్తూనే, మీకు, మీ కుటుంబానికి ఒక విజయవంతమైన, ఉజ్వల భవిష్యత్తుకు హామీ ఇస్తుంది.

ఇది అంతర్జాతీయ విద్యా వారోత్సవాల సందర్భం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులకు నేను ఒక సింపుల్ ప్రశ్న వేయదల్చుకుంటున్నాను. మీరు ఏ యూనివర్శిటీలో లేక గ్రాడ్యుయేట్ స్కూల్లో చేరాలని కోరుకుంటున్నారు? ఇది మీ జీవితంపై మహత్తర ప్రభావం కలిగించే ఎంపిక అవుతుంది. ప్రత్యేకించి ఈ కరోనా అని శ్చిత పరిస్థితుల కాలంలో మీరు ఏం నిర్ణరుుంచుకుంటారననేది కీలకమైన అంశం. ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది విద్యార్థులకు ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం ఏదంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే చెప్పాలి. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఎక్కువమంది విద్యార్థులు అమెరికాలో విద్య అభ్యసిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గత దశాబ్దికాలంలో దాదాపు రెట్టింపు కావడం విశేషంగా చెప్పాల్సి ఉంటుంది.

ఉన్నత విద్య చదవాలంటే అమెరికానే ఎందుకు ఎంపిక చేసుకోవాలి? ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ప్రముఖ విద్యా సంస్థలు, సృజనాత్మక విద్యలో పరిణతి చెందిన నాయకత్వం, అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఫ్యాకల్టీ, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఇతర సౌకర్యాలు మాత్రమే కాకుండా, పూర్వవిద్యార్థులతో కూడిన నెట్‌వర్క్, విద్యార్థులు విజయవంతంగా కెరీర్లు ఏర్పర్చుకోవడంలో సలహా సహకారాలు అందించే కంపెనీల అధిపతులతో అనుసంధానం వంటి అనేక విద్యాపరమైన అవకాశాలకు అమెరికా పెట్టింది పేరు. విద్యార్థుల అభిప్రాయాలను గౌరవిస్తూ, వారి నుంచి ప్రశ్నలు, చర్చలను ఆహ్వానించే ప్రపంచ స్థారుు ప్రొఫెసర్లు మీకు విద్యా బోధన చేస్తారు. డైనమిక్ అమెరికన్ సిటీ లైఫ్ లేదా విశిష్టమైన కాలేజి టౌన్ లైఫ్ అనుభవాన్ని అందిస్తూ, అమెరికన్లతో, ఇతర అంతర్జాతీయ విద్యార్థులతో కమ్యూనిటీ తత్వం కలిగిన వైవిధ్యపూరితమైన జీవితం గడిపే అవకాశాన్ని అమెరికా విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులకు అందిస్తారుు.

పైగా, సోషల్ మీడియా, సినిమాలు, సంగీతం, పుస్తకాలు, ట్రావెల్ లేదా మీరు కలిసే అమెరికన్ల ద్వారా అమెరికన్ స్వప్నం అనే మాటను మీరు వినే ఉంటారు. ఆ అమెరికన్ స్వప్న అనుభవాన్ని తప్పక పొందాలని, ఆస్వాదించాలని మీరు నిత్యం కోరుకునేలా చేస్తూ ఉంటుంది. అంతర్జాతీయ విద్యార్థులు ఎంపిక చేసుకునే అతి విశిష్టమైన గమ్యస్థానంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు చాలా కాలంగా ప్రపంచాన్ని ఊరిస్తూనే ఉంది. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఉన్నతవిద్యకు సంబంధించి 4 వేల వరకు గుర్తింపు పొందిన విద్యా సంస్థలు ఉంటున్నారుు. ప్రపంచ స్థారుు నాయకులు, సృజనకారులు అమెరికా వర్సిటీల నుంచి డిగ్రీలు పుచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రపం చం ఎదుర్కొంటున్న అత్యంత కష్టభూరుుష్టమైన సవాళ్లలో కొన్నింటిని పరిష్కరించడంలో వీరు నిమగ్నమై ఉన్నారు. ఉదాహరణకు, తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విజయవంతమైన సీఈఓలు సత్యనాదెళ్ల (మైక్రోసాఫ్ట్), శంతను నారాయణ్ (అడోబ్), పద్మశ్రీ వారియర్ (ఫెబుల్), అరవింద్ కృష్ణ (ఐబీఎమ్).. వీరందరూ అమెరికాలో డిగ్రీ చదువు పూర్తి చేసుకున్నవారేనని చెప్పవలసిన పనిలేదు.

అమెరికా యూనివర్శిటీల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇప్పుడు సృజనాత్మకమైన వ్యాపారవేత్తలుగా, శాస్త్రజ్ఞులుగా, ఆర్టిస్టులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, విద్యావేత్తలుగా పనిచేస్తూ మన ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపర్చడంలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి ఏటా విస్తరిస్తూన్న ప్రతిభా సంపన్నులైన ఈ పూర్వ విద్యార్థుల భారీ సముదాయంలో మీరు కూడా చేరి వారి మహత్తర కృషిలో భాగం పంచుకోవచ్చు. క్లాసురూమ్ లోపలా, వెలుపలా విశిష్ట దృక్పథాలను వెలువరించే అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా విశ్వవిద్యాలయాలు, కాలేజీలు ఎంతగానో విలువనిస్తున్నారుు. ఒక విద్యార్థిగా, విద్యార్థినిగా మీ ఆలోచనలను, మీ సంస్కృతిని కూడా అమెరికన్ ఫ్యాకల్టీతో, విద్యార్థులతో, కమ్యూనిటీలతో మీరు పంచుకునే అవకాశం కూడా ఉంది. అంతర్గతంగా అనుసంధానమైన ప్రపంచంలో విజయవంతమైన భవిష్యత్తును పంచుకోవడంలో సంసిధ్ధమయ్యేలా మీరు మాకు ఎంతగానో సహకరించవచ్చు.

విశ్వవిద్యాలయాలపై, విద్యార్థులపై కోవిడ్-19 మహమ్మారి గత కొద్ది నెలలుగా విసిరిన తీవ్రమైన సవాళ్లను మేము గుర్తిస్తున్నాము. వచ్చే సంవత్సరం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చదువుకోవాలని ప్లాన్ చేసిన అంతర్జాతీయ విద్యార్థులు తమ స్వప్నాలను చిదిమివేసుకోరని మేం ప్రగాఢంగా కాంక్షిస్తున్నాం. తమ క్యాంపస్‌లో క్లాసులను ఎప్పుడు మొదలుపెడుతున్నాం అనే విషయాన్ని అమెరికా కాలేజీలు, యూనివర్శిటీలు అంతర్జాతీయ విద్యార్థినీ విద్యార్థులకు సరైన సమయంలో ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటారుు. కాబట్టి అమెరకన్ క్యాంపస్‌లతో ఇప్పటికే చేరివున్న విద్యార్థులు నిత్య సంబంధాలను కొనసాగించవచ్చు. తమ విద్యార్థులందరికీ సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విషయంలో అమెరికా విద్యా సంస్థలు గర్వపడుతుంటారుు. వచ్చే సంవత్సరం కూడా దీనికి మినహారుుంపుగా మాత్రం ఉండదు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని మనసులో ఉంచుకుంటూనే అమెరికన్ విద్యాసంస్థలు అత్యున్నత నాణ్యతతో కూడిన విద్యను అందించడంలో నిబద్ధత ప్రదర్శిస్తుంటారుు. క్లుప్తంగా చెప్పాలంటే, ఈరోజు అమెరికాలో డిగ్రీపై మీరు పెడుతున్న పెట్టుబడి మీ విజయవంతమైన భవిష్యత్తుకోసం పెడుతున్న పెట్టుబడిగా భావించేందుకు అవసరమైన ప్రతి ఒక్క అంశాన్ని అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థలు మనసులో ఉంచుకుంటూ తదనుగుణంగా వ్యవహరిస్తుంటారుు. అమెరికాలో చదవడం అనే మీ స్వప్నాన్ని మీరు ఇప్పటికీ సాకారం చేసుకోవచ్చు.

అమెరికా కాలేజీలు, యూనివర్శిటీల గురించిన విస్తృత సమాచారంతో మిమ్మల్ని అనుసంధానం చేయడానికి భారతదేశంలోని ఎడ్యుకేషన్‌యుఎస్‌ఏ (EducationUSA) సలహాదారులు మీతో కనెక్ట్ అయేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వర్చువల్‌గా ఒక విద్యార్థితో సెషన్, గ్రూప్ సలహా సెషన్లు, వెబినార్స్, వర్చువల్ కాలేజ్ ఫెరుుర్స్ వంటి వాటిని ప్రతిపాదించడమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా విసృ్తతంగా సమాచారాన్ని అందించడానికి సలహాదారులు పూనుకోవడమే కాకుండా, మీరు ఆశిస్తున్న సరైన సమాధానాలను పొందడానికి గానూ, అమెరికా విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో కనెక్ట్ కావడంలో మీకు నిత్యం సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అమెరికాలో చదువు సాగించడంపై మీకు ఉన్న సమస్త ప్రశ్నలకూ ఈ విద్యా సలహాదారులు సమాధానం చెబుతారు. మీ విద్యాపరమైన, వ్యక్తిగతమైన లక్ష్యాల పరిపూర్తి కోసం మీకు తగిన విద్యా సంస్థ ఏదో మీరే కనుగొనడానికి వారు సహకారం అందిస్తారు. డిగ్రీ పూర్తి చేశాక క్షేత్రస్థారుులో పని అనుభవం సాధించడానికి అమెరికాలోనే కొంత కాలం గడపడానికి పలువురు విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెరుునింగ్ గురించి కూడా ఈ విద్యా సలహాదారులు వివరించి చెబుతారు. ఎడ్యుకేషన్‌యుఎస్‌ఎ అనేది అమెరికన్ ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న సర్వీస్.

దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం విద్యార్థులు www.educationusa.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేక సమీపంలోని ఎడ్యుకేషన్యుఎస్‌ఏ రీజనల్ కార్యాలయాలను సంప్రదించవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ ప్రశ్నలను usiefhyderabad@usief.org.in కి ఈమెరుుల్ పంవవచ్చు. మా సరికొత్త ఎడ్యుకేషన్‌యుఎస్‌ఏ పార్టనర్ వై-యాక్సిస్ ఫౌండేషన్ (Y-Axis Foundation) గురించిన ప్రకటనకు వేచి ఉండండి. 2021 ప్రారంభంలో అమెరికాలో చదువుకోగోరే విద్యార్థులకు ఇది ఉచిత సేవలను ప్రారంభిస్తుంది.

హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సుల్ జనరల్‌గా, అమెరికాలో చదువుకోవడంపై మీరు ఆలోచించాలని నేను ప్రోత్సహిస్తున్నాను. 2021లో ఆమెరికన్ కాలేజీలో లేక యూనివర్సిటీలో చదువుకోవాలని మీరు ప్లాన్ చేసుకుంటున్నట్లరుుతే దయచేసి ఆ లక్ష్య సాధనను కొనసాగించాలని నేను కోరుతున్నాను. అమెరికాలో విద్యకు సంబంధించి మరింతగా తెలుసుకోవాలని ఉంటే, మా ఎడ్యుకేషన్‌యుఎస్‌ఏ సలహాదారులను సంప్రదించండి. ప్రతిదీ అనిశ్చితంగానే కనిపిస్తున్న ఈ కష్టకాలంలో, అమెరికన్ డిగ్రీ అనేది మీదైన ప్రపంచాన్ని విస్తరింపజేసే శక్తివంతమైన మార్గాన్ని ప్రతిపాదిస్తూనే, మీకు, మీ కుటుంబానికి ఒక విజయవంతమైన, ఉజ్వల భవిష్యత్తుకు హామీ ఇస్తుంది.
- (అంతర్జాతీయ విద్యా వారోత్సవాల సందర్భంగా)వ్యాసకర్త అమెరికా కాన్సుల్ జనరల్, హైదరాబాద్, మాజీ రాయబారి
Published date : 19 Nov 2020 04:14PM

Photo Stories