Skip to main content

టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులలో ఆన్-లైన్ మాస్టర్స్ డిగ్రీలు..

విద్యా బోధనారంగంలో ఉన్న అధ్యాపకులు పైస్థాయిలో టీచింగ్‌కి వెళ్లాలనుకున్నప్పుడు లేదా స్కూల్ నిర్వాహకులుగా మారాలనుకున్నప్పుడు వారికి హయ్యర్ డిగ్రీలు అవసరమవుతాయి. కాగా, అమెరికాతోపాటు అన్ని ఇతర దేశాలలో టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నవారు తమ ఉద్యోగాలు చేసుకుంటూనే గుర్తింపు పొందిన అగ్రశ్రేణి యు.ఎస్. యూనివర్సిటీ నుంచి దూరవిద్య ద్వారా అన్-లైన్‌లో టీచర్ ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీలు చేసే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది.

ప్రతిష్టాత్మకమైన ‘యు.ఎస్. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్’ వారు టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులలో అన్-లైన్ మాస్టర్స్ డిగ్రీలకి టాప్ ర్యాంకులు ఇచ్చిన యు.ఎస్. యూనివర్సిటీలలో మొదటి పదింటిని ఈ రోజు చూద్దాం.

1వ స్థానం: సెయింట్ జాన్స్ యూనివర్సిటీ (క్వీన్స్, ఎన్.వై.): ఇది ప్రయివేట్ యూనివర్సిటీ. అన్ని క్లాసులను రికార్డు చేసి ఆన్-లైన్ లో విద్యార్థులు ఎప్పుడంటే అప్పుడు చూసుకునేందుకు వీలుగా పోస్ట్ చేస్తారు. ట్యూషన్ ఫీజు (ఒక్కో క్రెడిట్‌కి) 1,050 డాలర్లు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి అప్లికేషన్ తుది గడువు మే 01. టోఫెల్ స్కోర్లు చూస్తారు. ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్, టీచింగ్ చిల్డ్రన్ విత్ డిజేబిలిటీస్ ఇన్ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్లాంటివి ఇక్కడ అందుబాటులో ఉన్న ఆన్-లైన్ కోర్సులు.

2వ స్థానం: ఆబర్న్ యూనివర్సిటీ (ఆబర్న్, ఏ.ఎల్.). పబ్లిక్/437 డాలర్లు/ఏడాది పొడుగునా ఎప్పుడైనా సరే అప్లయ్ చేసుకునే వీలున్న ‘రోలింగ్’ అడ్మిషన్‌లు/జి.ఆర్.ఇ., టోఫెల్ స్కోర్లు అవసరం. ఇక్కడ అగ్రి సైన్స్ ఎడ్యుకేషన్; బిజినెస్/మార్కెటింగ్ ఎడ్యుకేషన్ లాంటి వాటిలో మాస్టర్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

3వ స్థానం: సౌత్ డకోటా స్టేట్ యూనివర్సిటీ (బ్రూకింగ్, ఎస్.డి.). పబ్లిక్/రోలింగ్/ 383 డాలర్లు/టోఫెల్ స్కోర్లు చూస్తారు. ఇక్కడ ‘ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్’, ‘కరిక్యులమ్ ఇన్‌స్ట్రక్షన్’లాంటి కోర్సులు ఉన్నాయి.

4వ స్థానం: నార్త్ ఇల్లినాయ్ యూనివర్సిటీ (డికాల్బ్, ఐ.ఎల్.). పబ్లిక్/రోలింగ్/637 డాలర్లు/జి.ఆర్,ఇ., టోఫెల్, స్కోర్లు కావాలి. స్కూల్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇన్‌స్ట్రక్షనల్ టెక్నాలజీ లాంటి మాస్టర్స్ కోర్సులు ఇక్కడ ఆన్-లైన్ చేయవచ్చు.

5వ స్థానం: యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా (కొలంబియా, ఎస్.సి.). పబ్లిక్/రోలింగ్/1,008 డాలర్లు/జి.ఆర్.ఇ., టోఫెల్ స్కోర్లు అవసరం. ఎడ్యుకేషన్ టెక్నాలజీ, హయ్యర్ ఎడ్యుకేషన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లాంటి కోర్సులు ఇక్కడ ఉన్నాయి.

6వ స్థానం: యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్ (స్క్రాంటన్, పి.ఏ.) ప్రయివేట్/రోలింగ్/ 465 డాలర్లు/టోఫెల్ స్కోర్లు చూస్తారు. ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్‌చ కరిక్యులమ్ ఇన్‌స్ట్రక్షన్ లాంటి వాటిలో మాస్టర్స్ కోర్సులు ఇక్కడ చేయవచ్చు.

7వ స్థానం: జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ (వాషింగ్టన్, డి.సి.). ప్రయివేట్/ఏప్రిల్ 01/618 డాలర్లు/జి.ఆర్.ఇ./ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్, కరిక్యులమ్ ఇన్‌స్ట్రక్షన్ లాంటి కోర్సులు.

8వ స్థానం: యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా (కీర్నీ, ఎన్.ఇ.). పబ్లిక్/రోలింగ్/393 డాలర్లు/స్కూల్ ప్రిన్సిపాల్‌షిప్; ఎలిమెంటరీ, సెకండరీ ఎడ్యుకేషన్; స్పెషల్ ఎడ్యుకేషన్ లాంటి కోర్సులు.

9వ స్థానం: యూనివర్సిటీ ఆఫ్ నార్తరన్ కొలరాడో (గ్రీలీ, సి.ఓ.). పబ్లిక్/రోలింగ్/495 డాలర్లు/జి.ఆర్.ఇ., టోఫెల్ స్కోర్లు అవసరం/ఎడ్యుకేషనల్ సైకాలజీ, టీచింగ్ అప్లికేషన్స్, ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్ మొదలైన కోర్సులు.

10వ స్థానం: ఈస్టర్న్ కెంటకీ యూనివర్సిటీ (రిచ్మండ్, కె.వై.). పబ్లిక్/350 డాలర్లు/జి.ఆర్.ఇ., టోఫెల్ రిక్వయిర్మెంట్ ఉంది. ఆన్-లైన్ మాస్టర్స్ ఎడ్యుకేషన్ టీచింగ్ ట్రాక్‌లో ఇక్కడ 15 కోర్సులు ఉన్నాయి.

Published date : 08 Feb 2013 02:00PM

Photo Stories