Skip to main content

సొంతంగా జి-మాట్ ప్రిపరేషన్!

యు.ఎస్.లో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులలో చేరడానికి అవసరమైన జి-మాట్ (గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ టెస్ట్)కి ఎవరికి వారే ప్రిపేర్ అవ్వాలనుకుంటే అందుకుగల అవకాశాలను గురించి ఇవాళ తెలుసుకుందాం. ఒక్క అమెరికాలోనే కాక ప్రపంచం మొత్తం మీద 2,000 యూనివర్శిటీలు, ఇతర విద్యాసంస్థలలో సుమారు 5,000 బిజినెస్ కోర్సులలో ప్రవేశానికి జి-మాట్ స్కోర్స్‌ని ఒక కొలబద్దగా స్వీకరిస్తారు.

వందకి పైగా దేశాలలో 530 టెస్టు సెంటర్‌లలో ఈ పరీక్ష ఏడాది పొడుగునా అందుబాటులో ఉంటుంది. ఇండియాలో హైరదాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, కోచ్చి సహా 16 కేంద్రాలలో ఈ పరీక్ష రాయాలనుకునేవారు ముందుగా విజ్ఞప్తి చేసుకునే ప్రాతిపదిక మీద (ఆన్-డిమాండ్) సంవత్సరంలో ఎప్పుడైనా రాసే వెసులుబాటు ఉంది. దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఇటీవల ఇండియాలోని వివిధ పరీక్షా కేంద్రాలలో ఒక్క సంవత్సరంలోనే ఈ టెస్టుకి హాజరయ్యారు. గత ఏడాది జూన్ నుంచి ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ అనే సెక్షన్‌ని జి-మాట్‌లో కొత్తగా ప్రవేశపెట్టారు.

1. జి-మాట్ పరీక్షకి రిజిస్టర్ చేసుకోవాలన్నా, పరీక్ష తేదీని మార్చుకోవాలన్నా, రద్దు చేసుకోవాలన్నా, టెస్ట్ ప్రిపరేషన్‌కి ఫ్రీ-సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఇస్తున్న వెబ్‌లింక్‌కి వెళ్లి మొదట మీరు అక్కడ కొన్ని వివరాలు నింపి ‘సైన్-ఇన్’ చెయ్యాలి.https://www.mba.com/service/reg-profile.aspx

2. ఇక్కడ ఇస్తున్న మరొక లింక్‌లో జి-మాట్ ప్రిపరేషన్‌కి ఫ్రీ-సాప్ట్‌వేర్ లభిస్తుంది.
https://www.mba.com/the-gmat/download-free-test-preparation-software.aspx
అందులో 30 క్వాంటిటేటివ్, 45 వెర్బల్, 15 ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ - మొత్తం 90 ఫ్రీ-క్వశ్చన్లు ఆన్సర్సు వివరణలతో సహా లభిస్తాయి. ఇంకా మీ ప్రాక్టీస్ టెస్టు ప్రశ్నల్ని మీరే రూపొందించుకోవడానికి ఉపయోగపడే టూల్స్, రెండు పూర్తిస్థాయి కంప్యూటర్ అడాప్టివ్ ప్రాక్టీస్ టెస్టులు, ఒక సమగ్రమైన గణిత సమీక్ష (మాథ్ రివ్యూ), జి-మాట్ ప్రిపరేషన్‌కి సంబంధించిన స్టెప్-బై-స్టెప్ గైడ్ ఉంటాయి. మరింత అదనపు సమాచారాన్ని అందించే అడ్వాన్డ్స్ ప్యాకేజీని కొనుగోలు చెయ్యడానికి సూచనలు కూడా ఇక్కడ చూడవచ్చు.

3. కొన్ని జి-మాట్ ప్రిపరేషన్ టిప్స్ ఇక్కడ ఇస్తున్న వెబ్‌లింక్‌లో లభిస్తాయి. https://www.mba.com/the-gmat/prepare-for-the-gmat.aspx

4. జి.మాట్ హాండ్ బు పి.డి.ఎఫ్.వెర్షన్‌ని
https://www.mba.com/~/media/Files/mba/NEWTheGMAT/gmat-handbook.pdf  ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published date : 04 Mar 2013 01:37PM

Photo Stories