స్కాలర్‌షిప్స్
Sakshi Education
విద్య అనగానే భారీ ఫీజులు, తడిసిమోపుడయ్యే ఖర్చులే గుర్తుకొస్తాయి. అందుకే విదేశీ యూనివర్సిటీల్లోచదువుకోవాలని ఉన్నా..చాలామంది ముందడుగేయలేరు. ఇప్పుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం ఆయా దేశాల్లో పలు స్కాలర్‌షిప్స్ అందుబాటులోకి వచ్చాయి.
అకడమిక్ రికార్డ్, నిర్ణీత టెస్ట్ స్కోర్లలో ప్రతిభతోపాటు విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం ఖరారు చేసుకుంటే చాలు.. స్కాలర్‌షిప్ అందుకునేందుకు అవకాశాలు ఎన్నో! తద్వారా ఫీజుల ఆందోళనకు ఫుల్‌స్టాప్ పెట్టి... విదేశీ విద్య స్వప్నాన్ని
సాకారం చేసుకోవచ్చు!! ఫాల్ సెమిస్టర్ ప్రవేశ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీ విద్య ఔత్సాహికులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ల వివరాలు..
1. ఆస్ట్రేలియా
విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ముందంజలో నిలుస్తున్న దేశం ఆస్ట్రేలియా. అందుకోసం ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థులకు పలు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది.
మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, రీసెర్చ్‌కు పేరున్న దేశం జర్మనీ. ఇక్కడి యూనివర్సిటీలు ఉన్నతవిద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు పలు స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి.
DAAD స్కాలర్‌షిప్
జర్మనీలో ఉన్నత విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు అత్యున్నత స్కాలర్‌షిప్ సదుపాయం కల్పించే పథకం.. డాడ్ స్కాలర్‌షిప్. ఈ స్కాలర్‌షిప్ మేరకు విద్యార్థులకు రీసెర్చ్, ట్యూషన్ ఫీజు, ట్రావెల్ గ్రాంట్స్ లభిస్తాయి. దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ స్కాలర్‌షిప్ పరిధిలో ఉంటాయి.
వివరాలకు వెబ్‌సైట్: www.daad.in/en
కోఫి అన్నన్ ఎంబీఏ స్కాలర్‌షిప్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్:
జర్మనీలోని యూరోపియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించేందుకు అందుబాటులోకి తెచ్చిన పథకం ఇది. కనీసం ఏడాది వ్యవధి కలిగిన మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశించే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఈఎస్‌ఎంటీ విభాగంలో 25 వేల యూరోలు, ఎంఐఎం విభాగంలో 43,500 యూరోల స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.esmt.org
3. సింగపూర్
సింగపూర్‌లో ఉన్నతవిద్య పట్ల ఇటీవల కాలం లో భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. 3 ప్రభుత్వ యూనివర్సిటీలు, పలు ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు కలిగిన సింగపూర్... అంతర్జాతీయ విద్యార్థులకు పలు స్కాలర్‌షిప్ సదుపాయాలు కల్పిస్తోంది.
ఎస్‌ఐఏ యూత్ స్కాలర్‌షిప్
సింగపూర్ ప్రభుత్వ విద్యాశాఖ అందిస్తున్న ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఇది. సింగపూర్‌లోని గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలల్లో చేరే విద్యార్థులకు దీన్ని అందిస్తారు. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ఏటా 2,400 సింగపూర్ డాలర్లతోపాటు, ఉచిత హాస్టల్ సదుపాయం లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.moe.gov.sg/home
నాన్యాంగ్ స్కాలర్‌షిప్
సింగపూర్ ప్రభుత్వ యూనివర్సిటీ.. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ అందిస్తున్న మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్ ఇది. ఉత్తమ అకడమిక్ ట్రాక్ రికార్డు కలిగి.. ఈ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు, బుక్స్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఉచిత వసతి లభిస్తాయి.
వివరాలకు వెబ్‌సైట్: WWW.admissions.ntu.edu.sg
సింగపూర్ మిలీనియం స్కాలర్‌షిప్స్
సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రీ-డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఔత్సాహికులకు అందిస్తున్న స్కాలర్‌షిప్స్ ఇవి. ఎంఎస్సీ విద్యార్థులకు నెలకు 2000 సింగపూర్ డాలర్లు; పీహెచ్‌డీ విద్యార్థులకు 3 వేల సింగపూర్ డాలర్లు, పోస్ట్ డాక్టోరల్ అభ్యర్థులకు అయిదు వేల సింగపూర్ డాలర్లు లభిస్తాయి.
వివరాలకు వెబ్‌సైట్: www.singaporemillenniumfoundation.com.sg
సింగపూర్ ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ అవార్డ్:
సింగపూర్‌లోని ప్రముఖ యూనివర్సిటీలు సంయుక్తంగా రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. దీని పరిధిలో ఆయా యూనివర్సిటీల్లో సైన్స్, ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీలో ప్రవేశం ఖరారు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నాలుగేళ్లపాటు ఏటా 24 వేల సింగపూర్ డాలర్లు అందిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.a-star.edu.sg/singa-award
ఎన్‌యూఎస్ ఎంబీఏ ఫెలోషిప్
సింగపూర్‌కు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన వారికి సదరు యూనివర్సిటీ అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకం ఎన్‌యూఎస్ ఎంబీఏ ఫెలోషిప్. ఎంబీఏలో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ల ఆధారంగా కనిష్టంగా ఎనిమిది వేలు, గరిష్టంగా 58 వేల సింగపూర్ డాలర్లను అలవెన్స్‌గా చెల్లిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: WWW.mba.nus.edu./en/fees-finances/scholarships
4. యునెటైడ్ కింగ్‌డమ్ (యూకే)
భారతీయ విద్యార్థులకు అమెరికా తర్వాతి గమ్యం యూకే. కారణం.. పేరున్న యూనివర్సిటీలు, నాణ్యమైన బోధన. ఫీజులు, ఇతర వ్యయం అధికంగా ఉండే యూకేలో ఉన్నతవిద్యకు పలు స్కాలర్‌షిప్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
గేట్ బ్రిటన్ స్కాలర్‌షిప్స్
యూకేలో విదేశీ విద్యార్థులకు లభిస్తున్న ప్రధా నమైన స్కాలర్‌షిప్స్‌గా గ్రేట్ బ్రిటన్ స్కాలర్‌షిప్స్‌ను పేర్కొనొచ్చు. బ్రిటిష్ కౌన్సిల్ ఏటా అందించే స్కాలర్‌షిప్స్ ఇవి. మన దేశ విద్యార్థులకు ఈ ఏడాది 67 మందికి ఇవ్వనున్నారు. యూనివర్సిటీ బట్టి స్కాలర్‌షిప్ మొత్తం నిర్ణయమవుతుంది. పీజీ కోర్సు లకు అయిదు వేల నుంచి ఏడు వేల పౌండ్ల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.britishcouncil.in
చార్లెస్ వాలెస్ ఇండియా ట్రస్ట్ స్కాలర్‌షిప్స్
పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ తదితర కోర్సుల విద్యార్థులకు వీటిని అందిస్తారు. కనిష్టంగా మూడు వేల పౌండ్ల నుంచి గరిష్టంగా ఏడు వేల పౌండ్లు లభిస్తాయి. ఆర్ట్స్, హెరిటేజ్, కల్చర్ స్టడీస్ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

ఛెవెనింగ్ స్కాలర్‌షిప్స్
యూకే ప్రభుత్వం నేరుగా అందించే గ్లోబల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్.. ఛెవెనింగ్ స్కాలర్‌షిప్స్. పీజీ స్థాయిలో అన్ని కోర్సుల విద్యార్థులూ ఈ స్కాల ర్‌షిప్‌నకు అర్హులే. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మొత్తం మినహాయింపుగా లభిస్తుంది. ఎంపిక ప్రక్రి యలో భాగంగా విద్యార్థులు యూకే యూనివర్సిటీ నుంచి పొందిన అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ ఆధా రంగా చెవెనింగ్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకో వాల్సి ఉంటుంది. ఎంపిక విధానంలో అభ్యర్థుల అకడమిక్ ట్రాక్ రికార్డ్‌తోపాటు ఆన్‌లైన్ అసెస్‌మెం ట్స్ సైతం నిర్వహించి తుది జాబితా విడుదల చేస్తారు. ప్రస్తుతం 2018-19 సంవత్సరానికి సంబం ధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
వివరాలకు వెబ్‌సైట్: www.chevening.org
కామన్వెల్త్ షేర్డ్ స్కాలర్‌షిప్స్
యూకే ప్రభుత్వం డీఎఫ్‌ఐడీ (డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డవలప్‌మెంట్) సహకారంతో కామన్వెల్త్ స్కాలర్‌షిప్ కమిషన్, యూకే యూని వర్సిటీల ద్వారా కామన్వెల్త్ సభ్య దేశాల్లోని అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్‌షిప్స్.. కామన్వెల్త్ షేర్డ్ స్కాలర్ షిప్స్. ఏటా ఆయా దేశాలకు చెందిన 800 మందికి వీటిని అందిస్తారు. పీజీ స్థాయిలో అన్ని కోర్సుల విద్యార్థులు అర్హులు. ఎంపికైతే ట్యూషన్ ఫీజు మిన హాయింపుగా లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: https://cscuk.dfid.gov.uk
ఫెలిక్స్ స్కాలర్‌షిప్
యూకేలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్స్.. ఫెలిక్స్ స్కాలర్‌షిప్స్. వీటికి ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.felixscholarship.org
ఐఈఎల్‌టీఎస్ అవార్డ్స్
యూకేలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి అవస రమైన ఐఈఎల్‌టీఎస్ టెస్ట్‌లో మంచి ప్రతిభ చూపిన వారికి బ్రిటిష్ కౌన్సిల్ అందిస్తున్న స్కాలర్ షిప్.. ఐఈఎల్‌టీఎస్ అవార్డ్స్. ఐఈఎల్‌టీఎస్‌తో స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు కోసం రూ. మూడు లక్షలు అందజేస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.britishcouncil.org
గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్‌షిప్స్
బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అందిస్తు న్న స్కాలర్‌షిప్స్.. గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్‌షిప్స్. ఇవి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన వారికే లభిస్తాయి. ఎంపికైన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు, నివాస ఖర్చులు, డిపెండెంట్స్ అలవెన్స్‌లు పొందొచ్చు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.gatescambridge.org
హార్న్‌బై ఎడ్యుకేషనల్ ట్రస్ట్
యూకేలో దాదాపు అయిదు దశాబ్దాలుగా విదేశీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ సదుపాయం కల్పిస్తున్న సంస్థ ఎ.ఎస్.హార్న్‌బై ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ప్రధానంగా యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో పీజీ డిగ్రీ కోర్సులు చదివే వారికే అందిస్తారు. అంతేకాకుండా సదరు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయానికే స్వదేశంలో ఇంగ్లిష్ బోధనలో అనుభవం పొంది ఉండాలి.
వివరాలకు వెబ్‌సైట్: www.hornby-trust.org.uk
5. జపాన్
రీసెర్చ్ కార్యకలాపాల పరంగా ముం దంజలో నిలుస్తున్న జపాన్.. భారతీయ విద్యార్థులకు ప్రత్యేకంగా పలు స్కాలర్ షిప్స్ అందిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ నుంచి పోస్ట్ డాక్టోరల్ వరకు వీటిని అందుకునే వీలుంది.
జపనీస్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్
రీసెర్చ్ స్టూడెంట్ జపాన్ సంబంధిత హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, ఐటీ, మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ సహా 17 విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశంపొందిన వారికి ఈ స్కాలర్‌షిప్ సదుపాయం లభిస్తుంది. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ఏటా 1,43,000 జపాన్ యెన్‌లు స్టైపెండ్‌గా అందుతుంది. దీంతోపాటు ట్యూషన్ ఫీజు నుంచి మినహా యింపు ఉంటుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.in.emb-japan.go.jp
అండర్‌గ్రాడ్యుయేట్ స్టడీస్
సోషల్ సెన్సైస్, నేచురల్ సైన్స్, ఇంజ నీరింగ్, మెడిసిన్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కో ర్సుల్లో ప్రవేశం పొందిన వారికి లభించే స్కాలర్‌షిప్స్ ఇవి. అయిదేళ్లపాటు ఏడాదికి 1,17,000 యన్‌లు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్
పీజీ కోర్సుల విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్ పథకం ఇది. పబ్లిక్ అడ్మినిస్ట్రే షన్, లోకల్ గవర్నెన్స్, లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో జపాన్ యూని వర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసుకోవాలి. ఎంపికైన వారికి ఏడాది వ్యవధిలో నెలకు 2,42,000 జపాన్ యెన్‌ల రూపంలో స్కాలర్‌షిప్ ఇస్తారు.
ఏషియన్ డవలప్‌మెంట్ బ్యాంక్ - జపాన్ స్కాలర్‌షిప్
జపాన్‌లోని యూనివర్సిటీల్లో ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, సైన్స్, టెక్నాలజీ తదితర కోర్సుల్లో పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సభ్యదేశాల విద్యార్థులకు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకం ఏడీబీ-జపాన్ స్కాలర్‌షిప్స్. ఏటా 150 మందికి ఏడీబీ బ్యాంక్ ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు, నివాస వ్య యం, ఇతర అకడమిక్ సంబంధిత వ్యయాలకు సరిపడే మొత్తాన్ని చెల్లిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.adb.org
6. అమెరికా
విదేశీ విద్య అంటే మన విద్యార్థులకు ఠక్కున గుర్తొచ్చే దేశం అమెరికా. ఈ దేశంలో ఇటీవల కాలంలో నిబంధనలు కఠినంగా మారాయి. భారతీయ విద్యా ర్థులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కొన్ని ప్రోత్సాహ కాలు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు..
ఫుల్‌బ్రైట్-నెహ్రూ ఫెలోషిప్స్
అమెరికాలోని యూనివర్సిటీల్లో ఆర్ట్స్, కల్చర్, మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, పబ్లిక్ అడ్మి నిస్ట్రేషన్ తదితర విభాగాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి అందుబాటులో ఉన్న పథకం.. ఫుల్ బ్రైట్ నెహ్రూ మాస్టర్స్ ఫెలోషిప్. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చు లకు సరిపడే మొత్తాన్ని అందిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.usief.org.in
హ్యూబర్ట్ హంప్రే ఫెలోషిప్ ప్రోగ్రామ్
అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ప్రోత్సాహకం... హ్యూబర్‌ట హంప్రే ఫెలోషిప్ ప్రోగ్రామ్. కనీసం ఐదేళ్ల ప్రొఫెషనల్ అనుభవంతో అమెరికాలోని యూని వర్సిటీల్లో అడుగుపెట్టినవారు ఈ ఫెలోషిప్‌నకు దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ముఖ్యంగా సస్టెయిన బుల్ డెవలప్‌మెంట్, డెమొక్రటిక్ ఇన్‌స్టిట్యూషన్ బిల్డిం గ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకునే వారికి పది నెలల పాటు ఫెలోషిప్ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చులకు సరిపడే మొత్తం లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.humphreyfellowship.org
ఆగాఖాన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
అమెరికాలోని యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయే ట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు అందు బాటులో ఉన్న మరో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్.. ఆగాఖా న్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్. దీనికి ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మొత్తంలో 50 శాతాన్ని ఉచితంగా, మరో 50 శాతాన్ని రుణం రూపంలో అందిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.akdn.org
ఏఏసీఈ స్కాలర్‌షిప్స్
అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కంప్యూటింగ్ ఇన్ ఎడ్యుకేషన్ (ఏఏసీఈ) స్కాలర్‌షిప్స్‌కు అగ్రికల్చర్, కెమికల్, సివిల్, ఇండస్ట్రియల్, ఆర్కిటెక్చరల్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్, మెకానికల్, మైనింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఫాల్ సెమిస్టర్ సెషన్‌లో ఎంఎస్‌లో చేరిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి ఏటా రెండు వేల డాలర్ల నుంచి ఎనిమిది వేల డాలర్ల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇది అభ్యర్థుల ప్రతిభ, ఎంపిక చేసుకున్న బ్రాంచ్ ఆధారంగా ఉంటుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.aace.org
మరికొన్ని స్కాలర్‌షిప్స్
అమెరికా సరిహద్దు దేశం కెనడాలోని యూనివర్సిటీలు నాణ్యమైన విద్య అందిం చడంలో ముందుంటున్నాయి. దాంతో అంతర్జాతీయంగా వివిధ దేశాలతోపాటు మన దేశ విద్యార్థులు కూడా ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు.
బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్
హెల్త్ సైన్స్, నేచురల్ సెన్సైస్, ఇంజనీ రింగ్, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ విభాగాల్లో రీసెర్చ్ ఔత్సాహికులకు బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్ అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీ యంగా అన్ని దేశాలకు సంబంధించి ఏటా 70 మందికి వీటిని అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 70 వేల డాలర్లు చొప్పున రెండేళ్లపాటు ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వెబ్‌సైట్: www.banting.fellowships-bourses.gc.ca
టుడే సాలర్‌షిప్స్
ది ట్రుడే ఫౌండేషన్ నిర్వహిస్తున్న పథకమిది. దీన్ని కూడా డాక్టోరల్ (రీసెర్చ్) విద్యార్థులకే అందిస్తారు. సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ విభాగాల్లో పీహెచ్‌డీ చేయాలనుకున్న వారికి ఇవి లభిస్తాయి. ఎంపికైన వారికి ఏటా 60 వేల డాలర్ల స్కాలర్‌ిషిప్‌తో
పాటు 20 వేల డాలర్ల ట్రావెలింగ్ అలవెన్స్ అందుతుంది.
వివరాలకు వెబ్‌సైట్:
వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్
కెనడియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, నేచురల్ సెన్సైస్, ఇంజనీరింగ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, సోషల్ సెన్సైస్ అండ్ హ్యుమానిటీస్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పథకం.. వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్. కెనడాలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా 50 వేల డాలర్లు చొప్పున మూడేళ్లపాటు ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.vanier.gc.ca
మరికొన్ని స్కాలర్‌షిప్స్: కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్- మాస్టర్స్ ప్రోగ్రామ్స్, ఐడీఆర్‌సీ రీసెర్చ్ అవార్డ్స్; ఎన్‌ఎస్ ఈఆర్‌సీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్; అన్నేవల్లె ఎకలాజికల్ ఫండ్.
ఎంపిక విధానం
స్కాలర్‌షిప్ కోరుకునే విద్యార్థులు ఆయా యూనివర్సిటీలు లేదా సంస్థలకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అప్పటికే తాము ఆయా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందినట్లు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా దరఖాస్తులను వడపోస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి రాత పరీక్ష లేదా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా రూపొందించి.. వారికి స్కాలర్‌షిప్/ఫెలోషిప్‌లు ఖరారు చేస్తారు.
అర్హతలు:

- ఆస్ట్రేలియా అవార్డ్స్ స్కాలర్‌షిప్స్: ఆస్ట్రేలియన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో వీటి ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పీజీ, పోస్ట్ డాక్టోరల్ స్థాయిలో పూర్తిస్థాయి ప్రవేశం పొందిన వారికి వీటిని అందజేస్తారు. ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు, రీసెర్చ్ కోసం అవసరమయ్యే అకడమిక్ వ్యయాలకు సరిపడే మొత్తానికి స్కాలర్‌షిప్ లభిస్తుంది.
- ఎండీవర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్: ఈ ప్రోగ్రామ్ పరిధిలో కూడా పీజీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అభ్యర్థులకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఏడాదికి 2,01,00 ఆస్ట్రేలియన్ డాలర్లు మంజూరు చేస్తారు. పీజీ అభ్యర్థులకు రెండేళ్లు, పీహెచ్‌డీ అభ్యర్థులకు మూడున్నరేళ్ల వరకు గడువు ఉంటుంది.
- ఎండీవర్ ఆస్ట్రేలియా చెంగ్ కాంగ్ రీసెర్చ్ ఫెలోషిప్: నాలుగు నుంచి ఆర్నెల్ల వ్యవధిలో రీసెర్చ్ చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్ పథకం. ఎంపికైన అభ్యర్థులకు 23,500 ఆస్ట్రేలియా డాలర్లు లభిస్తాయి.
- ఎండీవర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అవార్డ్స్: ఆస్ట్రేలియా ప్రభుత్వ పరిధిలోని కళాశాలల్లో, యూనివర్సిటీలలో డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, అసోసియేట్ డిగ్రీ ప్రవేశం పొందిన అభ్యర్థులకు వీటిని అందజేస్తారు. గరిష్టంగా 1,19,500 ఆస్ట్రేలియన్ డాలర్లు మంజూరు చేస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: https://india.highco mmission.gov.au/ndli/study8.html - ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్కాలర్‌షిప్స్: పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులకు ఉద్దేశించిన స్కాలర్‌షిప్ పథకమిది. ఏటా 300 మంది విదేశీ విద్యార్థులను ఆయా ప్రామాణికాల (రీసెర్చ్ టాపిక్, అకడమిక్ రికార్డ్ తదితర) ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: https://www.study inaustralia.gov.au
మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, రీసెర్చ్‌కు పేరున్న దేశం జర్మనీ. ఇక్కడి యూనివర్సిటీలు ఉన్నతవిద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు పలు స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి.
DAAD స్కాలర్‌షిప్
జర్మనీలో ఉన్నత విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు అత్యున్నత స్కాలర్‌షిప్ సదుపాయం కల్పించే పథకం.. డాడ్ స్కాలర్‌షిప్. ఈ స్కాలర్‌షిప్ మేరకు విద్యార్థులకు రీసెర్చ్, ట్యూషన్ ఫీజు, ట్రావెల్ గ్రాంట్స్ లభిస్తాయి. దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ స్కాలర్‌షిప్ పరిధిలో ఉంటాయి.
వివరాలకు వెబ్‌సైట్: www.daad.in/en
కోఫి అన్నన్ ఎంబీఏ స్కాలర్‌షిప్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్:
జర్మనీలోని యూరోపియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించేందుకు అందుబాటులోకి తెచ్చిన పథకం ఇది. కనీసం ఏడాది వ్యవధి కలిగిన మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశించే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఈఎస్‌ఎంటీ విభాగంలో 25 వేల యూరోలు, ఎంఐఎం విభాగంలో 43,500 యూరోల స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.esmt.org
3. సింగపూర్
సింగపూర్‌లో ఉన్నతవిద్య పట్ల ఇటీవల కాలం లో భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. 3 ప్రభుత్వ యూనివర్సిటీలు, పలు ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు కలిగిన సింగపూర్... అంతర్జాతీయ విద్యార్థులకు పలు స్కాలర్‌షిప్ సదుపాయాలు కల్పిస్తోంది.
ఎస్‌ఐఏ యూత్ స్కాలర్‌షిప్
సింగపూర్ ప్రభుత్వ విద్యాశాఖ అందిస్తున్న ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఇది. సింగపూర్‌లోని గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలల్లో చేరే విద్యార్థులకు దీన్ని అందిస్తారు. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ఏటా 2,400 సింగపూర్ డాలర్లతోపాటు, ఉచిత హాస్టల్ సదుపాయం లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.moe.gov.sg/home
నాన్యాంగ్ స్కాలర్‌షిప్
సింగపూర్ ప్రభుత్వ యూనివర్సిటీ.. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ అందిస్తున్న మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్ ఇది. ఉత్తమ అకడమిక్ ట్రాక్ రికార్డు కలిగి.. ఈ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు, బుక్స్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఉచిత వసతి లభిస్తాయి.
వివరాలకు వెబ్‌సైట్: WWW.admissions.ntu.edu.sg
సింగపూర్ మిలీనియం స్కాలర్‌షిప్స్
సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రీ-డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఔత్సాహికులకు అందిస్తున్న స్కాలర్‌షిప్స్ ఇవి. ఎంఎస్సీ విద్యార్థులకు నెలకు 2000 సింగపూర్ డాలర్లు; పీహెచ్‌డీ విద్యార్థులకు 3 వేల సింగపూర్ డాలర్లు, పోస్ట్ డాక్టోరల్ అభ్యర్థులకు అయిదు వేల సింగపూర్ డాలర్లు లభిస్తాయి.
వివరాలకు వెబ్‌సైట్: www.singaporemillenniumfoundation.com.sg
సింగపూర్ ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ అవార్డ్:
సింగపూర్‌లోని ప్రముఖ యూనివర్సిటీలు సంయుక్తంగా రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. దీని పరిధిలో ఆయా యూనివర్సిటీల్లో సైన్స్, ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీలో ప్రవేశం ఖరారు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నాలుగేళ్లపాటు ఏటా 24 వేల సింగపూర్ డాలర్లు అందిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.a-star.edu.sg/singa-award
ఎన్‌యూఎస్ ఎంబీఏ ఫెలోషిప్
సింగపూర్‌కు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన వారికి సదరు యూనివర్సిటీ అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకం ఎన్‌యూఎస్ ఎంబీఏ ఫెలోషిప్. ఎంబీఏలో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ల ఆధారంగా కనిష్టంగా ఎనిమిది వేలు, గరిష్టంగా 58 వేల సింగపూర్ డాలర్లను అలవెన్స్‌గా చెల్లిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: WWW.mba.nus.edu./en/fees-finances/scholarships
4. యునెటైడ్ కింగ్‌డమ్ (యూకే)
భారతీయ విద్యార్థులకు అమెరికా తర్వాతి గమ్యం యూకే. కారణం.. పేరున్న యూనివర్సిటీలు, నాణ్యమైన బోధన. ఫీజులు, ఇతర వ్యయం అధికంగా ఉండే యూకేలో ఉన్నతవిద్యకు పలు స్కాలర్‌షిప్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
గేట్ బ్రిటన్ స్కాలర్‌షిప్స్
యూకేలో విదేశీ విద్యార్థులకు లభిస్తున్న ప్రధా నమైన స్కాలర్‌షిప్స్‌గా గ్రేట్ బ్రిటన్ స్కాలర్‌షిప్స్‌ను పేర్కొనొచ్చు. బ్రిటిష్ కౌన్సిల్ ఏటా అందించే స్కాలర్‌షిప్స్ ఇవి. మన దేశ విద్యార్థులకు ఈ ఏడాది 67 మందికి ఇవ్వనున్నారు. యూనివర్సిటీ బట్టి స్కాలర్‌షిప్ మొత్తం నిర్ణయమవుతుంది. పీజీ కోర్సు లకు అయిదు వేల నుంచి ఏడు వేల పౌండ్ల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.britishcouncil.in
చార్లెస్ వాలెస్ ఇండియా ట్రస్ట్ స్కాలర్‌షిప్స్
పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ తదితర కోర్సుల విద్యార్థులకు వీటిని అందిస్తారు. కనిష్టంగా మూడు వేల పౌండ్ల నుంచి గరిష్టంగా ఏడు వేల పౌండ్లు లభిస్తాయి. ఆర్ట్స్, హెరిటేజ్, కల్చర్ స్టడీస్ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.britishcouncil.in
ఛెవెనింగ్ స్కాలర్‌షిప్స్
యూకే ప్రభుత్వం నేరుగా అందించే గ్లోబల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్.. ఛెవెనింగ్ స్కాలర్‌షిప్స్. పీజీ స్థాయిలో అన్ని కోర్సుల విద్యార్థులూ ఈ స్కాల ర్‌షిప్‌నకు అర్హులే. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మొత్తం మినహాయింపుగా లభిస్తుంది. ఎంపిక ప్రక్రి యలో భాగంగా విద్యార్థులు యూకే యూనివర్సిటీ నుంచి పొందిన అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ ఆధా రంగా చెవెనింగ్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకో వాల్సి ఉంటుంది. ఎంపిక విధానంలో అభ్యర్థుల అకడమిక్ ట్రాక్ రికార్డ్‌తోపాటు ఆన్‌లైన్ అసెస్‌మెం ట్స్ సైతం నిర్వహించి తుది జాబితా విడుదల చేస్తారు. ప్రస్తుతం 2018-19 సంవత్సరానికి సంబం ధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
వివరాలకు వెబ్‌సైట్: www.chevening.org
కామన్వెల్త్ షేర్డ్ స్కాలర్‌షిప్స్
యూకే ప్రభుత్వం డీఎఫ్‌ఐడీ (డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డవలప్‌మెంట్) సహకారంతో కామన్వెల్త్ స్కాలర్‌షిప్ కమిషన్, యూకే యూని వర్సిటీల ద్వారా కామన్వెల్త్ సభ్య దేశాల్లోని అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్‌షిప్స్.. కామన్వెల్త్ షేర్డ్ స్కాలర్ షిప్స్. ఏటా ఆయా దేశాలకు చెందిన 800 మందికి వీటిని అందిస్తారు. పీజీ స్థాయిలో అన్ని కోర్సుల విద్యార్థులు అర్హులు. ఎంపికైతే ట్యూషన్ ఫీజు మిన హాయింపుగా లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: https://cscuk.dfid.gov.uk
ఫెలిక్స్ స్కాలర్‌షిప్
యూకేలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్స్.. ఫెలిక్స్ స్కాలర్‌షిప్స్. వీటికి ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.felixscholarship.org
ఐఈఎల్‌టీఎస్ అవార్డ్స్
యూకేలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి అవస రమైన ఐఈఎల్‌టీఎస్ టెస్ట్‌లో మంచి ప్రతిభ చూపిన వారికి బ్రిటిష్ కౌన్సిల్ అందిస్తున్న స్కాలర్ షిప్.. ఐఈఎల్‌టీఎస్ అవార్డ్స్. ఐఈఎల్‌టీఎస్‌తో స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు కోసం రూ. మూడు లక్షలు అందజేస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.britishcouncil.org
గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్‌షిప్స్
బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అందిస్తు న్న స్కాలర్‌షిప్స్.. గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్‌షిప్స్. ఇవి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన వారికే లభిస్తాయి. ఎంపికైన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు, నివాస ఖర్చులు, డిపెండెంట్స్ అలవెన్స్‌లు పొందొచ్చు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.gatescambridge.org
హార్న్‌బై ఎడ్యుకేషనల్ ట్రస్ట్
యూకేలో దాదాపు అయిదు దశాబ్దాలుగా విదేశీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ సదుపాయం కల్పిస్తున్న సంస్థ ఎ.ఎస్.హార్న్‌బై ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ప్రధానంగా యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో పీజీ డిగ్రీ కోర్సులు చదివే వారికే అందిస్తారు. అంతేకాకుండా సదరు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయానికే స్వదేశంలో ఇంగ్లిష్ బోధనలో అనుభవం పొంది ఉండాలి.
వివరాలకు వెబ్‌సైట్: www.hornby-trust.org.uk
5. జపాన్
రీసెర్చ్ కార్యకలాపాల పరంగా ముం దంజలో నిలుస్తున్న జపాన్.. భారతీయ విద్యార్థులకు ప్రత్యేకంగా పలు స్కాలర్ షిప్స్ అందిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ నుంచి పోస్ట్ డాక్టోరల్ వరకు వీటిని అందుకునే వీలుంది.
జపనీస్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్
రీసెర్చ్ స్టూడెంట్ జపాన్ సంబంధిత హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, ఐటీ, మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ సహా 17 విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశంపొందిన వారికి ఈ స్కాలర్‌షిప్ సదుపాయం లభిస్తుంది. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ఏటా 1,43,000 జపాన్ యెన్‌లు స్టైపెండ్‌గా అందుతుంది. దీంతోపాటు ట్యూషన్ ఫీజు నుంచి మినహా యింపు ఉంటుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.in.emb-japan.go.jp
అండర్‌గ్రాడ్యుయేట్ స్టడీస్
సోషల్ సెన్సైస్, నేచురల్ సైన్స్, ఇంజ నీరింగ్, మెడిసిన్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కో ర్సుల్లో ప్రవేశం పొందిన వారికి లభించే స్కాలర్‌షిప్స్ ఇవి. అయిదేళ్లపాటు ఏడాదికి 1,17,000 యన్‌లు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్
పీజీ కోర్సుల విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్ పథకం ఇది. పబ్లిక్ అడ్మినిస్ట్రే షన్, లోకల్ గవర్నెన్స్, లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో జపాన్ యూని వర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసుకోవాలి. ఎంపికైన వారికి ఏడాది వ్యవధిలో నెలకు 2,42,000 జపాన్ యెన్‌ల రూపంలో స్కాలర్‌షిప్ ఇస్తారు.
ఏషియన్ డవలప్‌మెంట్ బ్యాంక్ - జపాన్ స్కాలర్‌షిప్
జపాన్‌లోని యూనివర్సిటీల్లో ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, సైన్స్, టెక్నాలజీ తదితర కోర్సుల్లో పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సభ్యదేశాల విద్యార్థులకు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకం ఏడీబీ-జపాన్ స్కాలర్‌షిప్స్. ఏటా 150 మందికి ఏడీబీ బ్యాంక్ ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు, నివాస వ్య యం, ఇతర అకడమిక్ సంబంధిత వ్యయాలకు సరిపడే మొత్తాన్ని చెల్లిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.adb.org
6. అమెరికా
విదేశీ విద్య అంటే మన విద్యార్థులకు ఠక్కున గుర్తొచ్చే దేశం అమెరికా. ఈ దేశంలో ఇటీవల కాలంలో నిబంధనలు కఠినంగా మారాయి. భారతీయ విద్యా ర్థులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కొన్ని ప్రోత్సాహ కాలు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు..
ఫుల్‌బ్రైట్-నెహ్రూ ఫెలోషిప్స్
అమెరికాలోని యూనివర్సిటీల్లో ఆర్ట్స్, కల్చర్, మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, పబ్లిక్ అడ్మి నిస్ట్రేషన్ తదితర విభాగాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి అందుబాటులో ఉన్న పథకం.. ఫుల్ బ్రైట్ నెహ్రూ మాస్టర్స్ ఫెలోషిప్. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చు లకు సరిపడే మొత్తాన్ని అందిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.usief.org.in
హ్యూబర్ట్ హంప్రే ఫెలోషిప్ ప్రోగ్రామ్
అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ప్రోత్సాహకం... హ్యూబర్‌ట హంప్రే ఫెలోషిప్ ప్రోగ్రామ్. కనీసం ఐదేళ్ల ప్రొఫెషనల్ అనుభవంతో అమెరికాలోని యూని వర్సిటీల్లో అడుగుపెట్టినవారు ఈ ఫెలోషిప్‌నకు దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ముఖ్యంగా సస్టెయిన బుల్ డెవలప్‌మెంట్, డెమొక్రటిక్ ఇన్‌స్టిట్యూషన్ బిల్డిం గ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకునే వారికి పది నెలల పాటు ఫెలోషిప్ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చులకు సరిపడే మొత్తం లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.humphreyfellowship.org
ఆగాఖాన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
అమెరికాలోని యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయే ట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు అందు బాటులో ఉన్న మరో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్.. ఆగాఖా న్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్. దీనికి ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మొత్తంలో 50 శాతాన్ని ఉచితంగా, మరో 50 శాతాన్ని రుణం రూపంలో అందిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.akdn.org
ఏఏసీఈ స్కాలర్‌షిప్స్
అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కంప్యూటింగ్ ఇన్ ఎడ్యుకేషన్ (ఏఏసీఈ) స్కాలర్‌షిప్స్‌కు అగ్రికల్చర్, కెమికల్, సివిల్, ఇండస్ట్రియల్, ఆర్కిటెక్చరల్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్, మెకానికల్, మైనింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఫాల్ సెమిస్టర్ సెషన్‌లో ఎంఎస్‌లో చేరిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి ఏటా రెండు వేల డాలర్ల నుంచి ఎనిమిది వేల డాలర్ల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇది అభ్యర్థుల ప్రతిభ, ఎంపిక చేసుకున్న బ్రాంచ్ ఆధారంగా ఉంటుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.aace.org
మరికొన్ని స్కాలర్‌షిప్స్
- ఆసియన్ ఉమెన్ ఇన్ బిజినెస్ స్కాలర్‌షిప్ ఫండ్.
- కార్నెల్ యూనివర్సిటీ టాటా స్కాలర్‌షిప్
- ఫుల్‌బ్రైట్ నెహ్రూ రీసెర్చ్ ఫెలోషిప్
- ఎస్‌ఎన్ బోస్ స్కాలర్స్ స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్
- స్టాన్‌ఫర్డ్ రిలయన్స్ ధీరూభాయి ఫెలోషిప్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్
- వీటితోపాటు మిట్, స్టాన్‌ఫర్డ్, ప్రిన్స్‌టన్, కార్నిగి మెలాన్, జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ వంటి దాదాపు అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్/ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. విద్యార్థులు ఎప్పటికప్పుడు సదరు యూనివర్సిటీల వెబ్‌సైట్లను వీక్షించడం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
అమెరికా సరిహద్దు దేశం కెనడాలోని యూనివర్సిటీలు నాణ్యమైన విద్య అందిం చడంలో ముందుంటున్నాయి. దాంతో అంతర్జాతీయంగా వివిధ దేశాలతోపాటు మన దేశ విద్యార్థులు కూడా ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు.
బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్
హెల్త్ సైన్స్, నేచురల్ సెన్సైస్, ఇంజనీ రింగ్, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ విభాగాల్లో రీసెర్చ్ ఔత్సాహికులకు బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్ అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీ యంగా అన్ని దేశాలకు సంబంధించి ఏటా 70 మందికి వీటిని అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 70 వేల డాలర్లు చొప్పున రెండేళ్లపాటు ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వెబ్‌సైట్: www.banting.fellowships-bourses.gc.ca
టుడే సాలర్‌షిప్స్
ది ట్రుడే ఫౌండేషన్ నిర్వహిస్తున్న పథకమిది. దీన్ని కూడా డాక్టోరల్ (రీసెర్చ్) విద్యార్థులకే అందిస్తారు. సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ విభాగాల్లో పీహెచ్‌డీ చేయాలనుకున్న వారికి ఇవి లభిస్తాయి. ఎంపికైన వారికి ఏటా 60 వేల డాలర్ల స్కాలర్‌ిషిప్‌తో
పాటు 20 వేల డాలర్ల ట్రావెలింగ్ అలవెన్స్ అందుతుంది.
వివరాలకు వెబ్‌సైట్:
వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్
కెనడియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, నేచురల్ సెన్సైస్, ఇంజనీరింగ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, సోషల్ సెన్సైస్ అండ్ హ్యుమానిటీస్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పథకం.. వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్. కెనడాలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా 50 వేల డాలర్లు చొప్పున మూడేళ్లపాటు ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.vanier.gc.ca
మరికొన్ని స్కాలర్‌షిప్స్: కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్- మాస్టర్స్ ప్రోగ్రామ్స్, ఐడీఆర్‌సీ రీసెర్చ్ అవార్డ్స్; ఎన్‌ఎస్ ఈఆర్‌సీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్; అన్నేవల్లె ఎకలాజికల్ ఫండ్.
ఎంపిక విధానం
స్కాలర్‌షిప్ కోరుకునే విద్యార్థులు ఆయా యూనివర్సిటీలు లేదా సంస్థలకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అప్పటికే తాము ఆయా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందినట్లు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా దరఖాస్తులను వడపోస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి రాత పరీక్ష లేదా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా రూపొందించి.. వారికి స్కాలర్‌షిప్/ఫెలోషిప్‌లు ఖరారు చేస్తారు.
అర్హతలు:
- అకడమిక్‌గా పదో తరగతి నుంచి 60 శాతానికి మించిన మార్కులతో ఉత్తీర్ణత.
- టోఫెల్/ఐఈఎల్‌టీఎస్ టెస్ట్ స్కోర్స్.
- జీఆర్‌ఈ/జీమ్యాట్ టెస్ట్ స్కోర్స్.
- లెటర్స్ ఆఫ్ రికమండేషన్.
Published date : 19 Sep 2018 01:54PM