Skip to main content

ఫార్మ్-డి కోర్సులపై మరికొన్ని సందేహాలు

ఫార్మ్-డి కోర్సులపై మరికొన్ని సందేహాలు
నేను బి.ఫార్మసీ అండర్ గ్రాడ్యుయేట్‌ని. యు.ఎస్ గ్రీన్ కార్డ్ హోల్డర్‌ని కూడా. అమెరికాలో ‘‘ఫార్మ్-డి’’ చేసి లెసైన్డ్స్ ఫార్మసిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఈ కోర్సులో చేరడానికి ‘రిక్వయిర్మెంట్లు’ ఏమిటో చెబుతారా?


మొదటగా మీరు ‘‘ఫార్మసీలో ఎం.ఎస్. చేస్తే యు.ఎస్‌లో ఫార్మసిస్టు అవ్వలేరు’’ ఫార్మసీవిద్య-ప్రవేశం కష్టం, ప్రయోజనం అధికం’’ అనే శీర్షికలతో ఇప్పటికే ‘హలో అమెరికా’లో ప్రచురితమైన వ్యాసాలను ఇక్కడ ఇస్తున్న ‘సాక్షి’ హలో అమెరికా ఆర్కైవ్‌లో మరొక్కసారి చదవండి. ఇండియాలో బీఫార్మసీ చేసినవారు అమెరికాలో నేరుగా ‘ఫార్మ్-డి’ చెయ్యడానికి వీలు లేదు. అక్కడ ముందుగా రెండేళ్ళ ప్రీ-రిక్విజిట్ కోర్సు చెయ్యాలి. ఈ వివరాలన్నీ ఇక్కడ ఇస్తున్న వెబ్ లింకుల ద్వారా ‘హలో అమెరికా’ పూర్వ వ్యాసాలలో తెలుసుకోవచ్చు.

https://www.sakshi.com/Main/Dailydetails.aspx?Newsid=58600&Categoryid=30&subcatid=0

https://www.sakshi.com/Main/Dailydetails.aspx?Newsid=52408&Categoryid=30&subcatid=0

ఇక ‘అడ్మిషన్ రిక్వయిర్మెంట్లు,’ అర్హతలకు సంబంధించి గ్రీన్ కార్డ్ హోల్డర్లకు, ఇతరులకు మధ్య అంతరం ఏమీ ఉండదు. ‘ఫార్మ్-డి’లో ప్రవేశానికి ఎవరైనాసరే యు.ఎస్.లో ప్రీ-రిక్విజిట్ కోర్సులను చేసి ఉండవలసిందే. గ్రీన్‌కార్డు ఉన్నవారైతే ఎటూ అమెరికాలోనే ఉంటారు కనుక ఈ కోర్సులను అక్కడ చెయ్యడం విదేశీ విద్యార్థుల కంటే తేలిక. అలాగే, వీరికి యు.ఎస్‌లో చదువుకోవడం మిగతా వారికంటే తక్కువ ఖర్చవుతుంది.

‘ఫార్మ్-డి’ కోర్సుల వివరాలు ఎక్కడా దొరకలేదని రాశారు. ఇక్కడ ఇస్తున్న వెబ్‌లింక్‌ని అనుసరిస్తే ఈ కోర్సుని ఆఫర్ చేస్తున్న టాప్- ర్యాంకింగ్ ఫార్మసీ స్కూల్స్ జాబితా లభిస్తుంది.

అడ్మిషన్ రిక్వయిర్మెంట్లు తదితర వివరాల కోసం ఆ జాబితాలోని ప్రతి యూనివర్సిటీ ని ‘వెబ్-సెర్చ్’ చేసి చూసుకోండి.
https://grad-schools.usnews.rankingsandreviews.com/best-graduate-schools/top-healthschools/pharmacy-rankings
ఉదాహరణకు, ఇందులో మీకు నంబర్‌వన్ ర్యాంకింగ్ పొందిన ‘యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్ ఫ్రానిస్కో’ ఫార్మసీ స్కూలు ఎలాంటి అభ్యర్థులకు ప్రవేశం ఇస్తున్నదీ తెలుసుకోవాలంటే ఈ కింది వెబ్ లింక్‌ని అనుసరించవచ్చు.
https://pharmacy.ucsf.edu/pharmd/admissions/
ఇక ‘ఫార్మ్-డి’ కి అవసరమైన ‘ఫ్రీ-ఫార్మసీ’ కోర్సుల వివరాల కోసం ఒక ఉదాహరణగా... ‘యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్-కాలేజ్ ఆఫ్ ఫార్మసీ’ వెబ్‌లింక్‌ని ఫాలో అవ్వొచ్చు.
https://www.uh.edu/pharmacy/prospective-students/prepharmacy /index.php

Published date : 20 Mar 2013 01:30PM

Photo Stories